ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sourav Ganguly: సౌరవ్ గంగూలీపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్.. వారి ఆగ్రహానికి కారణమేంటంటే..

ABN, First Publish Date - 2023-05-23T11:32:04+05:30

ఐపీఎల్ 2023 సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కోహ్లీ, శుభ్‌మన్ గిల్ అద్భుత శతకాలతో ఆకట్టుకున్నారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ తరఫున కోహ్లీ సెంచరీ చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు (GTvsRCB) తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కోహ్లీ (Virat Kohli), శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అద్భుత శతకాలతో ఆకట్టుకున్నారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ తరఫున కోహ్లీ సెంచరీ చేశాడు. తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ తరఫున గిల్ శతకం సాధించాడు. గిల్ సెంచరీతో గుజరాత్ విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఇంటి దారి పట్టింది.

విరాట్ కోహ్లీకి ఈ ఐపీఎలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) ఆటగాళ్లతో గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఆ టీమ్ బౌలర్ నవీన్-ఉల్-హక్, మెంటార్ గౌతమ్ గంభీర్‌తో కోహ్లీ గొడవ పడ్డాడు. దీంతో కోహ్లీని వారిద్దరూ టార్గెట్ చేశారు. కోహ్లీని తక్కువ చేస్తూ లఖ్‌నవూ టీమ్ కూడా ట్వీట్ చేసింది. తాజాగా మాజీ దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కూడా ఆ మ్యాచ్ గురించి ఓ ట్వీట్ చేశాడు. ఆ మ్యాచ్‌లో అద్భుత సెంచరీ సాధించిన గిల్‌ను ఆకాశానికెత్తేశాడు. వరుసగా రెండు సెంచరీలు సాధించిన గిల్‌పై ప్రశంసలు కురిపించాడు.

Faf Du Plessis: ఆర్సీబీ గెలవదని ముందే చెప్పిన డుప్లెసిస్.. వైరల్ అవుతున్న పాత వీడియో!

``ఈ దేశంలో ఎలాంటి ప్రతిభావంతులు ఉన్నారు. శుభ్‌మన్ గిల్.. వావ్.. రెండు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు.. ఐపీఎల్‌ గొప్ప స్టాండర్డ్స్ పాటిస్తోంద``ని గంగూలీ ట్వీట్ చేశాడు. అయితే గిల్ లాగానే వరుసగా రెండు సెంచరీలు చేసిన కోహ్లీని గంగూలీ ప్రస్తావించలేదు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ గంగూలీపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. ``దాదా.. శుభ్‌మన్‌కు స్ఫూర్తి, అతడు అభిమానించే ఆటగాడైన కోహ్లీని మీరు ప్రస్తావించలేదు``, ``వరుసగా రెండు సెంచరీలు సాధించిన కోహ్లీ గురించి మాటలు లేవా`` అని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2023-05-23T11:32:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising