Virender Sehwag: శుభ్‌మన్ గిల్ టీమ్ కోసం ఆడడం లేదు.. యువ ఆటగాడిపై డాషింగ్ ఆటగాడి విమర్శలు!
ABN, First Publish Date - 2023-04-15T12:05:10+05:30
గుజరాత్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌పై టీమిండియా మాజీ ఆటగాడు, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. అతడు టీమ్ కంటే తన వ్యక్తిగత మైలురాళ్లపైనే ఎక్కువ దృష్టి పెట్టాడని సెహ్వాగ్ ఆరోపించాడు.
గుజరాత్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌పై (Shubman Gill) టీమిండియా మాజీ ఆటగాడు, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) విమర్శలు గుప్పించాడు. అతడు టీమ్ కంటే తన వ్యక్తిగత ప్రదర్శనపైనే ఎక్కువ దృష్టి పెట్టాడని సెహ్వాగ్ ఆరోపించాడు. గురువారం రాత్రి పంజాబ్ కింగ్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి (PBKSvsGT). ఈ మ్యాచ్‌లో 154 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టీమ్ ఒక బాల్ మిగిలి ఉండగా విజయం సాధించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 49 బంతుల్లో 67 పరుగులు చేశాడు.
శుభ్‌మన్ గిల్ అంత నెమ్మదిగా ఆడడంపై సెహ్వాగ్ విమర్శలు చేశాడు. ``గిల్ 49 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అతడు 50కి చేరుకోవడానికి 42 బంతుల వరకు ఆడాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేశాక మిగిలిన ఏడు బంతుల్లోనే 17 పరుగులు చేశాడు. అతడు ముందు నుంచి తన సహజ ధోరణిలో వేగంగా ఆడి ఉంటే మ్యాచ్ చివరి బంతి వరకు వెళ్లేది కాదు. హాఫ్ సెంచరీ కోసం నెమ్మదిగా ఆడడం వల్ల టీమ్‌కు రన్‌రేట్ సరిగ్గా ఉండద``ని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
SRHvsKKR: ఎట్టకేలకు జూలు విదిల్చిన హ్యారీ బ్రూక్.. విమర్శలకు ఒక్క ఇన్నింగ్స్‌తో చెక్!
ఆ మ్యాచ్‌లో గిల్ అవుట్ కావడంతో మ్యాచ్ కొంచెం కష్టంగా మారింది. సామ్ కర్రన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాహుల్ తెవాటియాకు బ్యాటింగ్ కష్టంగా మారింది. చివరి ఓవర్ ఐదో బంతికి ఫోర్ కొట్టి రాహుల్ మ్యాచ్‌ను గెలిపించాడు. మ్యాచ్ అనంతరం శుభ్‌మన్ మాట్లాడుతూ.. బౌండరీలు కొట్టడం కష్టంగా మారిందని, అందుకే నెమ్మదిగా ఆడానని తెలిపాడు. చివర్లో అవుట్ కావడం నిరాశ కలిగించిందని పేర్కన్నాడు.
Updated Date - 2023-04-15T12:05:10+05:30 IST