ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

GTvsRCB: వేన్ పార్నెల్ సూపర్ క్యాచ్.. సాహా క్యాచ్‌ను సింగిల్ హ్యాండ్‌తో ఎలా పట్టాడో చూడండి.. వీడియో వైరల్!

ABN, First Publish Date - 2023-05-22T11:20:44+05:30

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. మొదట విరాట్ కోహ్లీ సెంచరీతో బెంగళూరు భారీ స్కోరు సాధించింది. బెంగళూరు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని శుభ్‌మన్ గిల్ సెంచరీ కారణంగా గుజరాత్ ఛేదించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ (RCBvsGT) ఆసక్తికరంగా సాగింది. మొదట విరాట్ కోహ్లీ సెంచరీతో (Virat Kohli) బెంగళూరు భారీ స్కోరు సాధించింది. బెంగళూరు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సెంచరీ కారణంగా గుజరాత్ ఛేదించింది. ఈ ఓటమితో బెంగళూరు ఐపీఎల్ 2023 (IPL 2023) నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఆటగాడు వేన్ పార్నెల్ (Wayne Parnell) అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు.

ఆర్సీబీ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) మూడో ఓవర్లోనే అవుటయ్యాడు. అప్పటికి 12 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన సాహాను పార్నెల్ అద్భుత క్యాచ్‌తో (Wayne Parnell Catch) పెవిలియన్‌కు పంపాడు. మహ్మద్ సిరాజ్ వేసిన మూడో ఓవర్ చివరి బంతిని సాహా ఎక్స్‌ట్రా కవర్ వైపు బలంగా కొట్టాడు. అది బౌండరీయేనని అందరూ అనుకున్నారు. అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న పార్నెల్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో ఆ క్యాచ్ అందుకున్నాడు.

Virat Kohli: అయ్యో.. విరాట్ కోహ్లీ పోరాటం వృథా.. ఐపీఎల్ నుంచి ఆర్సీబీ అవుట్.. కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లీ!

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 197/5 స్కోరు చేసింది. కోహ్లీ (101 నాటౌట్) సెంచరీ చేశాడు. అనంతరం గుజరాత్‌ 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. గిల్ (104 నాటౌట్), విజయ్‌ శంకర్‌ (53) సత్తా చాటారు. గిల్‌ ``మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌``గా నిలిచాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ టైటాన్స్‌ 20 పాయింట్లతో పట్టికలో టాప్‌ స్థానాన్ని కొనసాగించింది.

Updated Date - 2023-05-22T11:20:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising