IPL Final 2023: సోమవారం కూడా ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?.. ఈ రోజు కూడా మ్యాచ్ రద్దయితే ఏం చేస్తారు?
ABN, First Publish Date - 2023-05-29T11:25:12+05:30
ఎంతో ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్-16 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
ఎంతో ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్-16 (IPL 2023) తుది అంకానికి చేరుకుంది. ఆదివారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (CSKvsGT) జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ వర్షం (Rain) కారణంగా రద్దయింది. కనీసం ఐదేసి ఓవర్ల చొప్పున అయినా ఆడించి విజేతను ప్రకటించాలని ఐపీఎల్ యాజమాన్యం భావించింది. అయితే వర్షం ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో వేలాదిగా స్టేడియంకు తరలివచ్చిన ప్రేక్షకులు నిరాశగా వెనుదిరిగారు.
ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే (IPL 2023 Final Match) ఉండడంతో ఈ రోజు (సోమవారం) మ్యాచ్ జరగనుంది. అయితే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ రోజు కూడా అహ్మదాబాద్‌లో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌పై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. మ్యాచ్ జరిగేదీ, లేనిదీ అనుమానాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దయితే పరిస్థితి ఏంటనే అనుమానాలు మొదలయ్యాయి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్ నిర్వహించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తారు.
Viral Video: మైదానంలో కోహ్లీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడో చూపించిన అనుష్క.. విరుష్క జోడీ సూపర్ ఫన్!
వర్షం వల్ల ఆలస్యమైతే 20 ఓవర్ల నుంచి 15 ఓవర్లు, 10 ఓవర్లు, 5 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. అది కూడా కుదరకపోతే సూపర్ ఓవర్ (Super Over) ద్వారా విజేతను నిర్ణయిస్తారు. సూపర్ ఓవర్ వేసే అవకాశం కూడా లేకపోతే లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ సీజన్ లీగ్ దశలో గుజరాత్ టైటాన్స్ అత్యధిక పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
Updated Date - 2023-05-29T11:25:12+05:30 IST