Ajinkya Rahane: ఐపీఎల్‌లో అదరగొడుతున్న రహానే.. ఇంతకీ అతడికి వచ్చేదెంతో తెలుసా?
ABN, First Publish Date - 2023-04-24T13:39:57+05:30
ఆదివారం రాత్రి కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో ఉంది.
ఆదివారం రాత్రి కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో ఉంది. అజింక్య రహానే (Ajinkya Rahane) (29 బంతుల్లో 71 పరుగులు) సంచలన ఇన్నింగ్స్ ఆడి ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్`` అవార్డును గెలుచుకున్నాడు. రహానే ఆకాశమే హద్దుగా చెలరేగి ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు.
రహానే ఇలాంటి బ్యాటింగ్ చేయడం ఈ సీజన్‌లో ఇదే తొలిసారి కాదు. ఈ సీజన్‌లో రహానే 5 మ్యాచ్‌లు ఆడి మొత్తం 209 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ దాదాపు 190 ఉండడం గమనార్హం. నిజానికి ఈ ఐపీఎల్‌లో (IPL 2023)రహానేను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. చెన్నై టీమ్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ రహానేకు అవకాశం రాలేదు. ముంబైతో మ్యాచ్‌కు ముందు మొయిన్ అలీ గాయపడడంతో అతడి స్థానంలో రహానే టీమ్‌లో వచ్చాడు. అప్పట్నుంచి అతడు బ్యాట్‌తో చెలరేగుతున్నాడు. ఇంతలా ఆడి విజయాలు అందిస్తున్న రహానేకు ఈ సీజన్‌కు గాను దక్కే మొత్తమెంతో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవడం ఖాయం.
MS Dhoni: నా ఫేర్‌వెల్ కోసం వచ్చారేమో.. ఈడెన్ గార్డెన్స్‌లో అభిమాన సంద్రంపై ధోనీ సరదా వ్యాఖ్యలు..
గతేడాది ఫామ్ కోల్పోయి బాగా తంటాలు పడిన రహానేను ఎవరూ పట్టించుకోలేదు. ఐపీఎల్ మినీ వేలంలో (IPL Auction) రహానే పట్ల ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు. చెన్నై టీమ్ మాత్రమే అతడి బేస్ ధర రూ.50 లక్షలకు తీసుకోవడానికి ఆసక్తి చూపించింది. దాంతో నామమాత్రపు ధరకే చెన్నై టీమ్ అతడిని దక్కించుకుంది. అయితే అతడే చెన్నై టీమ్‌కు తురుపు ముక్కలా మారాడు. రహానేకు ఈ ఐపీఎల్‌లో దక్కేది కేవలం రూ.50 లక్షలే అయినప్పటికీ అతడి కమ్‌బ్యాక్‌కు మాత్రం ఉపయోగపడుతోంది. త్వరలో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో (WTC Finatl Match)ఆస్ట్రేలియాతో తలపడే టీమిండియా జట్టులో రహానేకు ప్లేస్ ఖాయంగా కనిపిస్తోంది.
Updated Date - 2023-04-24T13:39:57+05:30 IST