ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Super Six: యశస్వి జైస్వాల్ సూపర్ సిక్స్.. ఆర్చర్ వేసిన బాల్ ఎంత పైకి వెళ్లిందంటే..

ABN, First Publish Date - 2023-05-01T08:52:16+05:30

రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సిక్స్‌లు, ఫోర్లతో అభిమానులకు మజా అందిస్తున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్ సత్తా చాటాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజస్థాన్ రాయల్స్ (RR) యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సిక్స్‌లు, ఫోర్లతో అభిమానులకు మజా అందిస్తున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌ (MI)తో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్ సత్తా చాటాడు. ఐపీఎల్‌లో (IPL 2023) తన తొలి సెంచరీ సాధించాడు. యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. ఈ 8 సిక్స్‌లలో ఒకటి ఏకంగా స్టేడియం పైకి వెళ్లిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

ముంబై బౌలర్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) వేసిన షాట్ బాల్‌ను జైస్వాల్ లెగ్ సైడ్ వైపు బలంగా ఫ్లిక్ చేశాడు. ఆ బంతి స్టేడియం పైకంటే ఎత్తుకు వెళ్లి గ్యాలరీ అవతల పడింది (Yashasvi Jaiswal Six). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ 62 బంతుల్లో 124 పరుగులు చేశాడు. జైస్వాల్ స్ట్రైక్ రేట్ 200 ఉండడం గమనార్హం. జైస్వాల్ సెంచరీ చేసినప్పటికీ ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ మాత్రం గెలవలేకపోయింది. ఛేజింగ్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ చెలరేగడంతో రాజస్థాన్ ఓడిపోయింది.

Shubman Gill: తన పాత ఫ్రాంచైజీని వెక్కిరిస్తూ శుభ్‌మన్ గిల్ పోస్ట్.. హార్దిక్ పాండ్యా ఎలా స్పందించాడంటే..

ఈ లీగ్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ టీమ్ ఐదింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు ఈ లీగ్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ముంబై నాలుగింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.

Updated Date - 2023-05-01T08:52:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising