ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fan Speed: ఫ్యాన్ స్పీడ్‌కు కరెంటు బిల్లుకు సంబంధం ఉందా..? రెగ్యులేటర్‌ను 5వ నెంబర్లో కాకుండా 4వ నెంబర్‌పై పెడితే..

ABN, First Publish Date - 2023-02-26T13:51:58+05:30

ఫ్యాను స్పీడుగా తిరిగితే సాధారణం కంటే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందా? వేసవిలోనూ కరెంట్ బిల్ మామూలుగానే ఉండాలంటే ఏం చెయ్యాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిబ్రవరి నెల ముగింపుకు వచ్చింది, సూర్యుడు సుర్రుమనిపిస్తాడు, ఉక్కపోతకు జనాలంతా అల్లాడిపోతారు. ఎండకు ఉవశమనంగా కాస్త చల్లగాలి కావాలి అందరికీ.. ఫ్యాన్ స్పీడు అయిదంకె చేరుతుంది కానీ కరెంట్ బిల్లు గుర్తొస్తుంది. ఎండ తాలూకూ ఉక్కపోతకు బదులు జేబుకు పడే చిల్లు గురించి ఆలోచిస్తాడు సగటు మధ్యతరగతి పౌరుడు. అయితే ఫ్యాన్ స్పీడుకు కరెంటు బిల్లుకు సంబంధం ఎంత? ఫ్యాను స్పీడుగా తిరిగితే సాధారణం కంటే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందా? వేసవిలోనూ కరెంట్ బిల్ మామూలుగానే ఉండాలంటే ఏం చెయ్యాలి తెలుసుకుంటే..

వేసవికాలం వస్తే ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం మామూలు సమయాల్లో కంటే ఎక్కువ అవుతుంది. చల్లగాలి కోసం ఫ్యాను స్పీడు కూడా ఎక్కువ పెట్టేస్తాం. అయితే ఫ్యాన్ స్పీడు పెట్టగానే కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేస్తుందని అంటుంటారు పెద్దోళ్ళు. కొందరైతే ఫ్యాన్ ను 5నెంబర్ స్పీడ్ లో కాకుండా 4లో పెడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుందని అంటారు. అయితే ఫ్యాన్ వాడుకునే పవర్ దాని వేగానికి సంబంధించిందే కావచ్చు కానీ అది రెగ్యులేటర్ పైన ఆధారపడి ఉంటుందంటున్నారు.

Read also: Smartphone Charging: ఈ నిజం తెలియకపోతే స్మార్ట్‌ఫోన్‌ను వాడటం వృథా.. అసలు చార్జింగ్ ఎంత ఉండాలో.. ఎంతలోపు ఉండకూడదో తెలుసా..?


ఫ్యాన్ ఎంత వేగంతో తిరిగినా రెగ్యులేటర్ సహాయంతో కరెంట్ బిల్లును కంట్రోల్ లోనే ఉంచుకోవచ్చట. కొన్ని రెగ్యులేటర్ లలో మాత్రం ఫ్యాన్ స్పీడు కేవలం 2లేదా3 పెట్టినపుడు వచ్చే కరెంట్ బిల్లు, 5స్పీడు పెట్టినపుడు వచ్చే కరెంటు బిల్లు మధ్య తేడా ఏమి ఉండదు. ఫ్యాన్ లో ఉండే రెగ్యులేటర్లు వోల్టేజిని తగ్గించడం ద్వారా ఫ్యాన్ వేగాన్ని నియంత్రిస్తాయి. ఇలా నియంత్రించినపుడు ఫ్యాన్ తక్కువ కరెంట్ ను వినియోగిస్తుంది. పాత ఫ్యాన్ లలో ఈ రెగ్యులేటర్ వ్యవస్థ వల్ల ఫ్యాన్లు తక్కువ కరెంట్ ను వినియోగించుకున్నా ఫ్యానుకు సప్లై అయ్యే కరెంట్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. ఈ కారణంగా ఫ్యాన్ స్పీడుగా తిరగకున్నా కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. అయితే ప్రస్తుతకాలంలో ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్ల వల్ల కరెంట్ ను ఆదా చెయ్యచ్చు. ఈ రెగ్యులేటర్ వల్ల ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ తక్కువతో సంబంధం లేకుండా కరెంట్ ఆదా అవుతుంది. సెగలు పుట్టించే వేసవికాలంలో ఫ్యాన్ స్పీడు పెంచడానికి భయపడకుండా మీ ఫ్యాన్ రెగ్యులేటర్ చెక్ చేయించి కరెంట్ బిల్లుకు కళ్ళెం వేయచ్చు.

Updated Date - 2023-02-26T13:52:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising