ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Androind Phones: ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. హై రిస్క్‌లో ఆ వర్షన్స్.. నిర్లక్ష్యం వహిస్తే అంతే సంగతులు!

ABN, First Publish Date - 2023-08-14T22:41:22+05:30

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లా? విచ్చలవిడిగా మీరు మీ మొబైల్‌ని వాడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే.. మీ ఫోన్‌లో చాలా లోపాలున్నాయి. మీకు తెలియకుండానే హ్యాకర్లు మీ ఫోన్‌ని హ్యాక్ చేసి..

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లా? విచ్చలవిడిగా మీరు మీ మొబైల్‌ని వాడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే.. మీ ఫోన్‌లో చాలా లోపాలున్నాయి. మీకు తెలియకుండానే హ్యాకర్లు మీ ఫోన్‌ని హ్యాక్ చేసి.. అందులో ఉన్న విలువైన సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉంది. ఈ మాట చెప్తోంది మేము కాదు.. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే! కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా (CERT-In) అనే కేంద్ర సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ తాజాగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో కొన్ని లోపాలను గుర్తించింది. ఈ లోపాలు హై రిస్క్‌తో కూడుకున్నవని.. వీటి ద్వారా హ్యాకర్లు ఫోన్‌లోని సమాచారాన్ని దోపిడీ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.


ఆండ్రాయిడ్‌ 10, 11, 12, 12ఎల్‌, 13 వెర్షన్లలో ఈ లోపాలను తాము గుర్తించినట్టు CERT-In ప్రకటించింది. ఫ్రేమ్‌వర్క్‌, ఆండ్రాయిడ్‌ రన్‌టైమ్‌, సిస్టమ్‌ కాంపోనెంట్‌, గూగుల్‌ ప్లే సిస్టమ్‌ అప్‌డేట్స్‌, కెర్నెల్‌, ఆర్మ్‌ కాంపోనెంట్స్‌, క్వాల్కమ్‌ క్లోజ్డ్‌ సోర్స్‌ కాంపోనెంట్స్‌లో కొన్ని తప్పిదాలు ఉన్నాయని.. ఆ తప్పిదాల కారణంగానే ఆండ్రాయిడ్ ఫోన్లలో లోపాలొచ్చాయని ఆ ఏజెన్సీ తెలిపింది. హ్యాకర్లకు మొబైల్ ఫోన్లను తమ అధీనంలోకి తీసుకోవడానికి ఈ లోపాలను ఉపయోగపడతాయని పేర్కొంది. ఈ లోపాలను అధిగమించి, హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే.. యూజర్లు ‘సెక్యూరిటీ ప్యాచ్‌’ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ ఉండాలని సూచించింది. ఇప్పటికే గూగుల్ సంస్థ ఆ సమస్యల్ని పరిష్కించేందుకు గాను సెక్యూరిటీ ప్యాచెస్‌ని విడుదల చేసింది.

ఈ సెక్యూరిటీ ప్యాచ్‌ని అప్డేట్ చేసుకోవాలంటే.. ముందుగా డివైజ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం సిస్టమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, సిస్టమ్ అప్డేట్స్‌పై క్లిక్ చేసి, ఏ అప్డేట్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది డౌన్‌లోడ్ అయ్యాక వెంటనే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అంతేకాదు.. యాప్‌లను కేవలం విశ్వసనీయమైన సోర్సుల నుంచి మాత్రమే ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని ఆ ఏజెన్సీ సూచించింది. ఫోన్‌లో మాల్వేర్ ఉందా? లేదా? అని తెలుసుకోవడం కోసం సెక్యూరిటీ యాప్‌ను వినియోగించాలని పేర్కొంది. ఫోన్‌కు బలమైన పాస్‌వర్డ్ పెట్టుకోవడంతో పాటు యాప్స్‌లో టు-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను తప్పకుండా ఉపయోగించాలని తెలిపింది. సో ఆండ్రాయిడ్ యూజర్స్.. బీ కేర్‌ఫుల్!

Updated Date - 2023-08-14T22:41:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising