ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Moto e13: మోటోలో ఇంతకు మించి తక్కువ ధరకు వచ్చిన.. వస్తున్న స్మార్ట్‌ఫోన్ లేదేమో..!

ABN, First Publish Date - 2023-02-08T22:15:25+05:30

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లలో (Budget Smartphones) మోటో బ్రాండ్ ఫోన్లకు (Moto Smartphones) మంచి ఆదరణే ఉంది. మధ్య తరగతి వినియోగదారులకు అందుబాటు ధరల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లలో (Budget Smartphones) మోటో బ్రాండ్ ఫోన్లకు (Moto Smartphones) మంచి ఆదరణే ఉంది. మధ్య తరగతి వినియోగదారులకు అందుబాటు ధరల్లో మోటరోలా ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్‌ను ఆవిష్కరిస్తూ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీని తట్టుకుని నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే మోటరోలా కంపెనీ తాజాగా ఒక సరికొత్త మోడల్‌తో ముందుకొచ్చింది. MOTOROLA e13 మోడల్‌ను వినియోగదారుల కోసం తీసుకొస్తున్నట్లు మోటరోలా ఇండియా (Motorola India) ప్రకటించింది. 2GB/4GB RAM, 64GB Built-in Storage, 5000mAh Battery ఈ motoe13 ప్రత్యేకతలుగా మోటో వెల్లడించింది. 6.5 అంగుళాల హెచ్‌డీ+డిస్‌ప్లే, 13 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, Unisoc T606 Processor motoe13 ఇతర ఫీచర్లు కావడం గమనార్హం.

ఫిబ్రవరి 15 నుంచి motoe13 స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర రిటైల్ స్టోర్స్‌లో మొదలుకానున్నట్లు మోటరోలా ఇండియా తెలిపింది. ఇక.. ఈ స్మార్ట్‌ఫోన్ ధర మాత్రం వినియోగదారులను ఆకర్షిస్తోందనే చెప్పక తప్పదు. 2 జీబీ వేరియంట్ ధర 6,999 రూపాయలు కాగా, 4 జీబీ వేరియంట్ ధర 7,999 రూపాయలు. Aurora Green, Cosmic Black, Creamy White రంగుల్లో motoe13 స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మోటరోలా పేర్కొంది.

ఫ్లిప్‌కార్ట్‌తో పాటు జియో మార్ట్‌లో కూడా ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే జియో కస్టమర్లుగా ఉన్నవారితో పాటు కొత్తగా జియో కస్టమర్‌గా మారే వారు 700 రూపాయల Flat Cashbackను Jio Lock Offer కింద పొందొచ్చని తెలిసింది. 10W Wired Charging సపోర్ట్ చేసేలా Moto E13 రూపొందింది. ఇక.. Dimensions విషయానికొస్తే 164.19mm, Width-74.95 mm, thickness-8.47 mm, Weight-179.5 Grams. IP52 సేఫ్టీ రేటింగ్ ఇచ్చిన ఈ Moto e13 స్మార్ట్‌ఫోన్ దుమ్ముూధూళిని, పొరపాటున నీటిలో పడినా పనిచేసేలా తయారుకావడం విశేషం.

Updated Date - 2023-02-08T22:15:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising