ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MOTO G14: మోటోరోలా నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు.. రేపే విడుదల

ABN, First Publish Date - 2023-07-31T17:37:51+05:30

ఇప్పుడిది స్మార్ట్‌ఫోన్ యుగం. అప్పట్లో రెడ్‌మీ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పు కారణంగా.. తక్కువ ధరలకే అదిరిపోయే ఫీచర్లతో ఫోన్లు రావడం మొదలైంది. ఈ దెబ్బకు స్మార్ట్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. ఇలాంటి తరుణంలో..

ఇప్పుడిది స్మార్ట్‌ఫోన్ యుగం. అప్పట్లో రెడ్‌మీ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పు కారణంగా.. తక్కువ ధరలకే అదిరిపోయే ఫీచర్లతో ఫోన్లు రావడం మొదలైంది. ఈ దెబ్బకు స్మార్ట్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. ఇలాంటి తరుణంలో.. జనాలకు ఆకర్షించేందుకు మొబైల్ కంపెనీలు, బడ్జెట్ ధరల్లోనే అధునాతన ఫీచర్స్‌తో అద్భుతమైన ఫోన్లను పోటాపోటీగా లాంచ్ చేస్తున్నాయి.

ఇప్పుడు మోటోరోలా సంస్థ ఆగస్టు 1వ తేదీన మన భారతదేశంలో మోటో జీ14 పేరుతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌ని లాంచ్ చేస్తోంది. విశేషం ఏమిటంటే.. అదే రోజు రెడ్‌మీ 12 కూడా లాంచ్ అవుతోంది. ఇప్పటికే ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఈ మోటో జీ14 డిజైన్, ఫీచర్లను వెల్లడిస్తూ.. లిస్టెడ్ జాబితాలో పొందుపరిచింది. ఇందులో 5G లేదు కానీ.. ఫీచర్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. డ్యుయెల్ రేర్ కెమెరాలు, 6.5-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్ట్-ఎనేబుల్డ్ స్టీరియో స్పీకర్‌లతో సహా.. మరికొన్ని ముఖ్యమైన ఫీచర్లను కలిగి ఉంది.


ఆండ్రాయిడ్ 13తో రన్ అయ్యే ఈ మోటో జీ14లో ఒక మేజర్ అప్డేట్ కూడా ఉంది. ఇందులో ఆండ్రాయిడ్ 14ని అప్డేట్ చేసుకోవచ్చు. నలుపు, నీలం రంగుల్లో ఈ ఫోన్ అందబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.15,000 వరకు ఉంది. 20W ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగిన తమ ఫోన్.. 94 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 34 గంటల టాక్ బ్యాక్‌టైమ్‌ను అందిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. ఈ ఫోన్ వెనుకవైపు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మాక్రో కెమెరాలు ఉన్నాయి.

మరోవైపు.. రెడ్‌మీ 12 విషయానికొస్తే 5జీ సపోర్ట్‌ని కలిగి ఉంది. 8GB ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో 5,000mAh బ్యాటరీ కలిగి ఉన్న ఈ రెడ్‌మీ ఫోన్ ధర రూ.20వేల లోపు ఉండొచ్చని సమాచారం. ఒకవేళ 4జీ వేరియెంట్ వస్తే.. దాని ధర రూ.15వేల వరకు ఉండొచ్చని అంచనా. రెడ్‌మీ 12, మోటో జీ14 చూడ్డానికి ఒకే పోలికలు కలిగి ఉంటాయి. మరి.. ఒకే రోజు పోటాపోటీగా వస్తున్న ఈ రెండు ఫోన్లలో ఏది విచ్చలవిడిగా అమ్ముడుపోతుందో? చూడాలి.

Updated Date - 2023-07-31T17:37:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising