ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈటలకు నోటీసులు

ABN, First Publish Date - 2023-04-07T04:41:43+05:30

టెన్త్‌ పేపర్‌ లీకేజీ కేసులో నోటీసుల పరంపర కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇద్దరు పీఏలకూ అందజేసిన పోలీసులు

10న విచారణకు హాజరవుతా: రాజేందర్‌

మేడ్చల్‌, కమలాపూర్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): టెన్త్‌ పేపర్‌ లీకేజీ కేసులో నోటీసుల పరంపర కొనసాగుతోంది. బీజేపీలో కీలకనేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కమలాపూర్‌ పోలీసులు గురువారం సాయం త్రం నోటీసులు అందజేశారు. మేడ్చల్‌ జిల్లా మేడ్చల్‌ మండలం పూడూరు ఓఆర్‌ఆర్‌ పక్కనే గల ఈటల నివాసంలో పోలీసులు నోటీసులు అందజేశారు. శుక్రవారం ఉదయం 11గంటలకు వరంగల్‌ డీసీపీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈటలతో పాటు ఆయన ఇద్దరు పీఏలు రాజు, నరేందర్‌లకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా, టెన్త్‌ పేపర్‌ లీకేజీ కేసులో తనకు నోటీసులు అందాయని, ఈ నెల 8న ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన ఉన్న నేపథ్యంలో తాను ఈ నెల 7న విచారణకు హాజరు కాలేనని, ఈనెల 10న ఉదయం 11గంటలకు హాజరవుతానని ఈటల పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. కాగా, తనకు వాట్సాప్‌ వాడటం రాదని, ఫోన్‌ వస్తే మాట్లాడటం తప్ప తన కేమీ తెలియదని ఈటల తెలిపారు. తాను వాట్సాప్‌ మెసేజ్‌లు ఓపెన్‌ చేయనని, తనకేదైనా అత్యవసర సమాచారం వస్తే తన పీఏలే చూస్తారని చెప్పారు.

Updated Date - 2023-04-07T04:41:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising