ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLA Sayanna: సాయన్న కుటుంబ సభ్యులను ఓదార్చిన కేసీఆర్

ABN, First Publish Date - 2023-02-19T19:14:00+05:30

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న(MLA Sayanna)కు సీఎం కేసీఆర్ (CM KCR) నివాళి అర్పించారు. సాయన్న కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న(MLA Sayanna)కు సీఎం కేసీఆర్ (CM KCR) నివాళి అర్పించారు. సాయన్న కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు. సాయన్న ఆకస్మిక మరణం బాధాకరమన్నారు. ఆయన వివిధ పదవులతో నిస్వార్థ సేవలందించారని కేసీఆర్ కొనియాడారు. సాయన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాయన్న మృతికి మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డి (KTR Mallareddy), తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. సాయన్న మృతి బీఆర్‌ఎస్‌ (BRS)కు తీరని లోటని, కంటోన్మెంట్ అభివృద్ధికి సాయన్న ఎంతో కృషి చేశారని మల్లారెడ్డి గుర్తుచేశారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయన్న... యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారు. షుగర్‌ లెవల్‌ పడిపోవడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. సాయన్న1951 మార్చి 5న జన్మించారు. టీడీపీ (TDP)లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచలుగా ఎదుగుతూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994, 1999, 2004, 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. 2015లో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2018లో బీఆర్‌ఎస్‌లో చేరారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

Updated Date - 2023-02-19T19:15:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising