PM Modi: కేసీఆర్ త్వరగా కోలుకోవాలి.. ప్రధాని మోదీ ఆకాంక్ష
ABN, First Publish Date - 2023-12-08T11:48:00+05:30
కేసీఆర్ కు గాయం కావడంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.
హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Ex CM KCR) గురువారం రాత్రి ఎర్రవెల్లి ఫాంహౌజ్(Erravelli Farm House)లోని బాత్ రూంలో జారిపడి గాయపడ్డ విషయం విదితమే. ఆయన్ని హుటాహుటిన యశోదా ఆసుపత్రికి తరలించారు. ఆయన ఎడమకాలి తుంటి ఎముక విరిగిందని వైద్యులు నిర్ధారించారు.
కేసీఆర్ కు గాయం కావడంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. "తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కి గాయం అయిందని తెలిసింది. ఇది చాలా బాధాకర విషయం. ఆయన త్వరగా కోలుకోవాలి. మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అని పోస్ట్ చేశారు.
కాగా "KCR Garu"(కేసీఆర్ గారు) అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ఎక్స్ లో ట్రెండింగ్ లో ఉంది. ఆయన ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్ ఎడమ తుంటి విరగినట్లు వైద్యులు చెబుతున్నారు. దీనికి శస్త్రచికిత్స అవసరం కావచ్చని అంటున్నారు.
Updated Date - 2023-12-08T12:02:58+05:30 IST