Balagam: తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం బలగం సినిమా: మంత్రి ఎర్రబెల్లి
ABN, First Publish Date - 2023-03-10T22:50:16+05:30
బలగం సినిమా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా ఉందని, గొప్ప కుటుంబ కథా చిత్రంగా బాగుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు
హైదరాబాద్: బలగం(Balagam) సినిమా తెలంగాణ(Telangana) సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా ఉందని, గొప్ప కుటుంబ కథా చిత్రంగా బాగుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(BRS Minister Dayakar Rao) అన్నారు. సకుటుంబ సపరివార సమేతంగా అందరూ కలిసి చూడాల్సిన మంచి సినిమాగా ఆయన అభివర్ణించారు. చాలా రోజుల తర్వాత తాను పూర్తి నిడివి సినిమా చూశానని చెప్పారు. సినిమా చూస్తున్నంత సేపు తనకు గ్రామీణ ప్రాంత కుటుంబాల సామాజిక చిత్రణ గుర్తుకు వచ్చిందని, సినిమాలో చూపించిన పలు అంశాలను మంత్రి ఉటంకించారు. తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలను బలగం సినిమా ద్వారా చిత్ర దర్శకుడు వేణు గొప్పగా చూపించారని మంత్రి అన్నారు.
తనకు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ నుంచి ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో సత్సంబంధాలు ఉన్నాయని ఎర్రబెల్లి చెప్పారు. సినిమా అంటే కొన్ని ఫైట్లు మరికొన్ని పాటలు కొంత డ్రామా మరికొంత సెంటిమెంటు ఏవో కొన్ని సీన్లతో నిండి ఉంటాయని, కానీ బలగం సినిమాలో ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా చిత్రకధాంశం చిత్రీకరణ నేపథ్యం కెమెరా పనితనం నటీనటుల సాంకేతిక వర్గ పనితనం ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి చిత్ర యూనిట్ ని అభినందించారు. ఇలాంటి గొప్ప సినిమాలు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి శంకర్ నాయక్ చిత్ర నిర్మాతలు దర్శకుడు హీరో ఇతర నటీనటులు సాంకేతిక వర్గం ఉన్నారు.
Updated Date - 2023-03-10T22:50:19+05:30 IST