Singer Sunitha : ఫోన్ నంబర్ బ్లాక్ చేసినా.. కొత్త నంబర్‌తో వేధింపులు
ABN, First Publish Date - 2023-04-24T07:57:28+05:30
ఫోన్‌లో వేధింపులకు గురిచేయడమే కాకుండా పలు రకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి ద్వారా తనకు ప్రాణహానీ ఉందంటూ....
బంజారాహిల్స్, (ఆంధ్రజ్యోతి): ఫోన్‌లో వేధింపులకు గురిచేయడమే కాకుండా పలు రకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి ద్వారా తనకు ప్రాణహానీ ఉందంటూ గాయని సునీత (Singer Sunitha) భర్త బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గాయని సునీత భర్త వీరపనేని రామకృష్ణ (Ram Veerapaneni) బంజారాహిల్స్ (Banjara Hills) రోడ్ నంబర్ 2లోని ఉమెన్స్ కోఆపరేటివ్ సొసైటీలో నివాసం ఉంటున్నాడు. సినీ నిర్మాతల (Movie Producers) కౌన్సిల్ సభ్యుడిని అంటూ కెకె లక్ష్మణ్ అనే వ్యక్తి రామకృష్ణ ఫోన్‌కు ఓ సందేశం పంపించాడు. వ్యక్తిగతంగా కలవాలని భావిస్తున్నట్టు దాని సారాంశం. తనకు తెలియని వ్యక్తి కావడంతో కలవడానికి రామకృష్ణ అంగీకరించలేదు. దీనికితోడు ఏదైనా వ్యాపార సంబంధిత విషయాల గురించి అయితే తన బృందాన్ని కలవాలని సూచించాడు. కాగా, తాను వ్యక్తిగతంగానే కలవాలని చెబుతూ నిత్యం సందేశాలతో (Messages) వేధిస్తుండటంతో ఆ నంబరును బ్లాక్ చేశాడు. ఇదిలా ఉండగా, 2023 మార్చి 28న మరో కొత్త నంబరుతో సందేశాలను పంపడం ప్రారంభించడంతోపాటు ఈసారి బెదిరింపులకు దిగాడు. దీంతో రామకృష్ణ తనకు తన కుటుంబ సభ్యులకు లక్ష్మణ్ నుంచి ప్రాణహాని ఉందని, అతన్ని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేకే లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-04-24T08:30:51+05:30 IST