ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ నోరు జారిన బాలయ్య...

ABN, First Publish Date - 2023-01-24T03:55:19+05:30

టాలీవుడ్‌ హీరో నందమూరి బాలకృష్ణ మళ్లీ నోరు జారారు. దివంగత దిగ్గజ నటుల గురించి మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్య చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందమూరి బాలకృష్ణ అనుచిత వ్యాఖ్య

ప్రసంగంలో మళ్లీ నోరు జారిన బాలయ్య

తీవ్రంగా తప్పుబడుతున్న నెటిజన్లు

హైదరాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): టాలీవుడ్‌ హీరో నందమూరి బాలకృష్ణ మళ్లీ నోరు జారారు. దివంగత దిగ్గజ నటుల గురించి మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్య చేశారు. దీనిపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం రాత్రి జరిగిన బాలకృష్ణ తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ సక్సెస్‌ మీట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ‘వీరసింహుని విజయోత్సవం’ పేరుతో నిర్వహించిన ఈ వేడుకలో మాట్లాడిన బాలకృష్ణ.. సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లను అభినందించారు. ఈ క్రమంలో వేదికపై ఉన్న జయరాం అనే ఆర్టిస్ట్‌ గురించి చెబుతూ, ‘‘ఇక ఈయన ఉన్నారంటే సెట్‌లో నాన్నగారి డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అన్నీ మాట్లాడుకుంటుండే వాళ్లం’’ అనేశారు. అయితే ‘అక్కినేని.. తొక్కినేని’ అనగానే అది ఎవరి గురించి అన్నారో అర్థం చేసుకుని సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే బాలకృష్ణ ఆ ఫ్లోలో మరో వ్యక్తి గురించి మాట్లాడడంతో ఎవరూ ఈ విషయాన్ని అంత సీరియ్‌సగా తీసుకోలేదు. కానీ, సోషల్‌ మీడియాలో మాత్రం దీని గురించి రచ్చ మొదలైంది. బాలకృష్ణ మాట్లాడిన వీడియోను పోస్ట్‌ చేసి, రకరకాల కామెంట్లతో నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. మరికొందరైతే ఈ విషయాన్ని చాలా సీరియ్‌సగా తీసుకొని.. ‘‘మా అక్కినేని గురించి అలా అంటారా?’’ అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Updated Date - 2023-01-24T08:41:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising