ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Daggubati Suresh Babu రౌడీలతో బెదిరించారు: ప్రమోద్

ABN, First Publish Date - 2023-02-11T14:09:09+05:30

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకు.. తనకు మధ్య గొడవేంటో ప్రమోద్ కుమార్ నేడు మీడియాకు వెల్లడించారు. ఫిలింనగర్ రోడ్ నెంబర్ వన్‌లో వెయ్యి గజాల స్థలాన్ని దగ్గుపాటి సురేష్ బాబు నుంచి 2018 లో కొనుగోలుకు అగ్రిమెంట్ చేసుకున్నామని ప్రమోద్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు (Daggubati Suresh Babu)కు.. తనకు మధ్య గొడవేంటో ప్రమోద్ కుమార్ నేడు మీడియాకు వెల్లడించారు. ఫిలింనగర్ (Film Nagar) రోడ్ నెంబర్ వన్‌లో వెయ్యి గజాల స్థలాన్ని దగ్గుపాటి సురేష్ బాబు నుంచి 2018 లో కొనుగోలుకు అగ్రిమెంట్ చేసుకున్నామని ప్రమోద్ తెలిపారు. అడ్వాన్స్‌గా ఐదు కోట్ల రూపాయలు దగ్గుబాటి సురేష్ బాబుకి ఇచ్చినట్టు వెల్లడించారు. తనకు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయకుండా సురేష్ బాబు కాలయాపన చేశారన్నారు. అదేమని అడిగితే గత ఏడాది నవంబర్ 3న రౌడీలతో బెదిరించారని తెలిపారు. ఆ వెంటనే బంజారా హిల్స్ పోలిసులకు పిర్యాదు చేసినా పట్టించుకోలేదని ప్రమోద్ వెల్లడించారు.

ఇక చేసేదేమీ లేక కోర్టులో పిర్యాదు చేశానని ప్రమోద్ వెల్లడించారు. కోర్టు తాను సమర్పించిన డాక్యుమెంట్‌పై సాధారణంగా కేసు నమోదు చేసిందన్నారు. మే ఒకటో తేదీన విచారణకు రావాలంటూ దగ్గుబాటి సురేష్ బాబుతో పాటు ఆయన కుమారుడు, ప్రముఖ నటుడు రానాకు నోటీసులు జారీ చేసిందని తెలిపారు. 2018 లో ఐదు కోట్ల రూపాయలకు అంటే గజం రూ.1,80 లక్షలకు అగ్రిమెంట్ చేసుకున్నామన్నారు. పలు కారణాల వల్ల దగ్గుబాటి సురేష్ బాబు రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. దీంతో స్పెసిఫిక్ పెర్ఫామెన్స్ కోర్టులో కేసు వేశానని ప్రమోద్ తెలిపారు. తన స్పెసిఫిక్ పెర్ఫామెన్స్ కోల్పోవడానికి సురేష్ బాబు 2021లో రాణాకు 9 కోట్లకు డమ్మీ రిజిస్ట్రేషన్ చేశారన్నారు. దీంతో మరోసారి తాను కోర్టును అప్రోచ్ అయ్యానన్నారు. దీంతో కోర్టు ఐదు సెక్షన్ల కింద కేసు బుక్ చేసిందని.. మే ఒకటి తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పిందని ప్రమోద్ వెల్లడించారు.

ప్రమోద్ కుమార్ కేసుపై లాయర్ పవన్...

ప్రమోద్ క్రిమినల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారించిందని లాయర్ పవన్ మీడియాకు తెలిపారు. సీసీ నెంబర్ 301 ఆఫ్ 2023 కింద ఐపీసి సెక్షన్ 352, 426, 447, 503, 506 ల కింద కాగ్నిజెన్స్ తీసుకొని సమన్లు జారీ చేసిందన్నారు. సురేష్ బాబు, రానా, కృష్ణాలతో పాటు పలువురికికు సమన్లు జారీ చేసిందని పవన్ తెలిపారు.

Updated Date - 2023-02-11T19:40:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising