ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ramakrishna Mission: స్వామి బోధమయానంద సీక్రెట్ ఆఫ్ సక్సెస్

ABN, First Publish Date - 2023-03-01T22:38:21+05:30

సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అనే అంశంపై స్వామి బోధమయానంద ప్రసంగించారు.

Swami Bodhamayananda
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కోటగిరి: రామకృష్ణ మిషన్ (Ramakrishna Mission) 125వ వార్షికోత్సవాల వేళ కామారెడ్డి జిల్లా కోటగిరి శ్రీరామకృష్ణ సేవా సమితి (Sri Ramakrishna Seva Samithi, Kotagiri) ఆధ్వర్యంలో వివేకానంద హైస్కూల్‌(Vivekananda High School)లో వేడుకలు జరిగాయి. హైదరాబాద్ రామకృష్ణ మఠం (Hyd Ramakrishna Math) అధ్యక్షులు స్వామి బోధమయానంద (Swami Bodhamayananda) ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివేకానంద పాఠశాలలోని మందిరంలో కొలువైన శ్రీరామకృష్ణ పరమహంస (Sri Ramakrishna Paramahansa), శారదా (Sarada Devi) మాత, స్వామి వివేకానంద (Swami Vivekananda) చిత్రపటాలకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వందలాది విద్యార్ధులను, యువతను ఉద్దేశించి ప్రసంగించారు. సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అనే అంశంపై స్వామి బోధమయానంద ప్రసంగించారు. ఏకాగ్రత కలిగి ఉండటం వల్ల విజయం సాధించడం సులభమౌతుందన్నారు. ఏకాగ్రత పెంచుకోవడానికి వివేకానంద మార్గం అనుసరించాలని చెప్పారు. ఏకాగ్రతను పెంచే ఆటలను ఆయన విద్యార్ధులతో ఆడించారు. విద్యార్ధులు, యువత అనవసర విషయాలకు ప్రాధాన్యతను ఇవ్వవద్దని ఆయన సూచించారు. ఆత్మ విశ్వాసం అన్నింటికన్నా మూలమని స్వామి బోధమయానంద చెప్పారు. స్వామి వివేకానంద సూక్తులను ఆయన విద్యార్థులతో చెప్పించారు. వేడుకల నిర్వహణలో కోటగిరి శ్రీరామకృష్ణ సేవా సమితి కన్వీనర్, వివేకానంద హైస్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ చొరవను స్వామి బోధమయానంద ప్రశంసించారు. హైదరాబాద్‌ నగరంతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనే కాక మండల కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోనూ యువత కోసం రామకృష్ణ మఠం మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుందని బోధమయానంద చెప్పారు.

కార్యక్రమంలో డీఐఈఓ రఘురాజన్, ఎంఈఓ నాగనాథ్, ఆర్గాన్ డొనేషన్ అసోసియేషన్ అధ్యక్షురాలు కాట్రగడ్డ భారతి, శ్రీరామకృష్ణ భావ ప్రచార పరిషత్ తెలంగాణ ఇంఛార్జ్ సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-01T22:38:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!