Hyderabad: రామకృష్ణ మఠంలో పారిశుద్ధ్య సిబ్బంది, తోటమాలులకు సత్కారం
ABN, First Publish Date - 2023-01-14T22:14:11+05:30
స్వామీ వివేకానంద 161వ జన్మతిథి వేడుకలు శనివారం హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ఘనంగా జరిగాయి.
హైదరాబాద్: స్వామి వివేకానంద(Swami Vivekananda)161వ జన్మతిథి వేడుకలు శనివారం హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జి.హెచ్.ఎమ్.సి. పారిశుద్ధ్య సిబ్బంది, నీలోఫర్ వైద్య సిబ్బంది, ఇందిరాపార్కు తోటమాలిలను, రామకృష్ణ మఠం సిబ్బందిని మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద సత్కరించారు. స్వామి వివేకానంద బోధనలను అందరూ ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం స్వామి వివేకానంద జీవిత విశేషాలతో కూడిన అంశాలపై పలు కార్యక్రమాలు జరిగాయి. ఉపన్యాసాలు, వేద పఠనం లాంటి కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు వివేకానంద జీవిత విశేషాలపై చిత్రప్రదర్శనను నిర్వహించారు. కొలంబో నుంచి అల్మోరా వరకు వివిధ ప్రాంతాల్లో వివేకానందుడి ప్రసంగాలు అప్పుడూ.. ఇప్పటికీ, ఎప్పటికీ యువతకు ఆదర్శంగా నిలుస్తాయని స్వామి బోధమయానంద చెప్పారు. స్వామి వివేకానంద నిరుపేదలను దైవంగా భావించేవారని గుర్తుచేశారు. నిరుపేదల ఉద్ధరణే ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం కావాలని స్వామి వివేకానంద చెప్పేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వామి యోగీశానంద, స్వామి శితికంఠానంద, స్వామి పరిజ్ఞేయానంద, స్వామి సీతేషానంద తదితరులు పాల్గొన్నారు.
ఫొటో గ్యాలరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - 2023-01-16T22:36:34+05:30 IST