ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Aaryajanani: గర్భిణులకు వైద్యులు, నిపుణుల సలహాలు

ABN, First Publish Date - 2023-03-02T21:57:16+05:30

రామకృష్ణ మఠం(Ramakrishna Math) ద్వారా గర్భిణులకు మార్గదర్శనం చేస్తున్న ఆర్యజనని(

Aaryajanani
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: రామకృష్ణ మఠం(Ramakrishna Math) ద్వారా గర్భిణులకు మార్గదర్శనం చేస్తున్న ఆర్యజనని(Aaryajanani) ఈ నెల 5వ తేదీన వర్క్‌షాప్ నిర్వహించనుంది. ఉదయం 9 నుంచి 12 వరకూ తెలుగు భాషలో ఆన్‌లైన్ వర్క్ షాప్ నిర్వహిస్తారు.

ఓ మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు రెండేళ్ళ వయసు వచ్చే వరకు అంటే 1,000 రోజుల వరకు గర్భిణులు పాటించవలసిన సూచనలను గైనకాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు గర్భిణులకు వివరిస్తారు.

ప్రసవానికి ముందు యోగా, గాఢమైన విశ్రాంతి, శ్వాసించడం, ధ్యానం వంటివాటికి సంబంధించిన శక్తిమంతమైన చిట్కాలను తెలియజేస్తారు. బిడ్డను పోషించడం, చనుబాలు ఇవ్వడం, శిశువుకు పోషకాహారం గురించి సమగ్ర సమాచారం ఇస్తారు. గర్భధారణ, మాతృత్వం గురించి ప్రయోజనకరమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు నిపుణులతో మాట్లాడవచ్చునని, అనుభవజ్ఞులైన దంపతులు, తల్లులతో సంభాషించవచ్చునని ఆర్యజనని నిర్వాహకులు తెలిపారు.

వర్క్‌షాపునకు హాజరుకావాలనుకునేవారు https://aaryajanani.org/ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 9603906906 వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

మరోవైపు ఈ నెల 12న ఆర్యజనని ఐదో వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. హైదరాబాద్ రామకృష్ణ మఠంలోని ఆడిటోరియంలో వేడుకలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2023-03-02T21:57:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!