Katragadda Prasuna: సంప్రదాయాల ప్రకారం మహిళల వస్త్రధారణ..
ABN, First Publish Date - 2023-06-18T12:21:51+05:30
హైదరాబాద్: తెలంగాణ హోంమంత్రి మెహమూద్ ఆలీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలపై మహిళా నేతలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా టీటీడీపీ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..
హైదరాబాద్: తెలంగాణ (Telangana) హోంమంత్రి మెహమూద్ ఆలీ (Home Minister Mehmood Ali) మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలపై మహిళా నేతలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా టీటీడీపీ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన (Katragadda Prasuna) ఆదివారం మీడియాతో మాట్లాడుతూ మహిళల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన హోంమంత్రి క్షమాపణలు (Apologies) చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ (Hindu), ముస్లిం (Muslim) మహిళల మధ్య కొట్లాటలు పెట్టేలా మంత్రి కామెంట్స్ ఉన్నాయని, మహిళల వస్త్రధారణ ఎలా ఉండాలో మగవారు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మహిళల వస్త్రధారణ వారి వారి సంప్రదాయాల ప్రకారం ఉంటుందని చెప్పారు. మహిళల వస్త్రాధరణపై హోంమంత్రి మగ అహంకార వ్యాఖ్యలు ఖండిస్తున్నానని, తెలుగుదేశం పార్టీ లౌకికవాదానికి మద్దతుగా నిలబడుతుందని కాట్రగడ్డ ప్రసూన స్పష్టం చేశారు.
Updated Date - 2023-06-18T12:21:51+05:30 IST