Joginapally Santosh Kumar: వ్యాపారులు స్వచ్ఛంద సేవకు ముందుకు రావడం అభినందనీయం
ABN, First Publish Date - 2023-07-10T23:39:54+05:30
కళామందిర్ వ్యవస్థాపక దినోత్సవం శనివారం ఓ ప్రైవేట్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తాతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
కళామందిర్ వ్యవస్థాపక దినోత్సవం శనివారం ఓ ప్రైవేట్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తాతో పాటు పలువురు సినీ ప్రముఖులు కలిసి.. కళామందిర్ ఫౌండేషన్ ద్వారా విరాళాలు అందించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ మాట్లాడుతూ వ్యాపార సంస్థలు వ్యాపార ధోరణితోనే కాకుండా చేనేత కార్మికులకు, అంధ విద్యార్థులకు, ఒంటరి మహిళలను నిర్వహించే స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అందించడం అభినందనీయం. సాధారణంగా వ్యాపార సంస్థల వార్షికోత్సవ వేడుకలు ఆట, పాటలతో సాగుతాయి.. కానీ ఇక్కడ అంధ విద్యార్థులు, వికలాంగులు, స్వచ్ఛంద సంస్థల మధ్య వేడుకలు జరుపుకోవడం నిజంగా సంతోషంగా ఉందని అన్నారు.
ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ చల్వాది ప్రసాద్ పలు స్వచ్ఛంద సంస్థలకు చెక్కుల రూపంలో విరాళాలు అందించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు మెహర్ రమేష్, అనిల్ రావిపుడి, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, సినీ హీరో సత్యదేవ్, మాజీ జేడీ లక్ష్మినారాయణ, హైపర్ ఆది, మీనాక్షి చౌదరి, నిత్యా నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికలాంగులు, అంధ విద్యార్థులు నిర్వహించిన ర్యాంప్‌షో అందరినీ అలరింపజేసింది.
Updated Date - 2023-07-10T23:39:54+05:30 IST