కేసీఆర్, కేటీఆర్ సహకారంతోనే నిధులు తేగలిగా
ABN, First Publish Date - 2023-09-30T01:20:53+05:30
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతోనే తాను నిధులు తేగలిగానని, శనివారం ఖమ్మం నియోజకవర్గంలో రూ.1390కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రూ.1,390కోట్లతో ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు
మున్నేరు వరద నివారణకు శాశ్వత చర్యలు
విలేకరుల సమావేశంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం, సెప్టెంబరు 29 (ఆంద్రజ్యోతిప్రతినిధి) : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతోనే తాను నిధులు తేగలిగానని, శనివారం ఖమ్మం నియోజకవర్గంలో రూ.1390కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ చొరవతో అటు ఎమ్మెల్యేగా, ఇటు మంత్రిగా భారీగా నిధులు తెచ్చి ఖమ్మం నగరాన్ని రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దానన్నారు. శనివారం ఉమ్మడిజిల్లాలో జరిగే మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన ప్రజలను కోరారు. జిల్లాలోని ఆయిల్‌ఫాం రైతులకు ఉపయుక్తంగా ఉండేలా మంత్రికేటీఆర్ పట్టుబట్టి గోద్రేజ్ సంస్థతో కొణిజర్ల మండలం గుబ్బగుర్తి వద్ద ఆయిల్‌ఫామ్ పరిశ్రమను పెట్టిస్తున్నారన్నారు. అలాగే పలు పార్కుల ప్రారంభం, మున్నేరు సీసీ వాల్, తీగల వంతెనకు శంకుస్థాపన, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీపనులకు శంకుస్థాపన లాంటి కార్యక్రమాలతో పాటు ప్రగతి నివేదన సభలో పాల్గొంటారన్నారు. ఆతర్వాత భద్రాచలం, సత్తుపల్లి పర్యటనకు వెళతారన్నారు. ఆరేళ్లుగా ఖమ్మం నియోజకవర్గానికి క్రమంతప్పకుండా వస్తూ భారీగా నిధులు మంజూరుచేస్తూ కేటీఆర్ ఎంతో అండగా ఉంటున్నారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీసీబీ చైర్మన కూరాకుల నాగభూషణం, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు కమర్తపు మురళి, కర్నాటి కృష్ణ పాల్గొన్నారు.
Updated Date - 2023-09-30T01:20:53+05:30 IST