వైభవంగా ముక్కోటి ఏకాదశి
ABN, First Publish Date - 2023-01-02T23:09:04+05:30
వర్గల్, జనవరి 2: నాచగిరి లక్ష్మీనృసింహస్వామి క్షేత్రం, వర్గల్ విద్యాధరి క్షేత్రంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, వర్గల్ వేణుగోపాలస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు.
వర్గల్, జనవరి 2: నాచగిరి లక్ష్మీనృసింహస్వామి క్షేత్రం, వర్గల్ విద్యాధరి క్షేత్రంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, వర్గల్ వేణుగోపాలస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. నాచగిరి లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో తెల్లవారుజామునే స్వామివారిని వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయ ఉత్తర ద్వారం వద్ద సుందరంగా తీర్చిదిద్దిన వేదికపై అధిష్టించారు. సహాయ కమిషనర్, ఆలయ కార్య నిర్వహణ అధికారి కట్ట సుధాకర్‌రెడ్డి పర్యవేక్షణలో పర్యవేక్షణలో వేడుకలు నిర్వహించారు. వర్గల్ వేణుగోపాలస్వామి ఆలయంలో వేదపండితులు వేదాంతం మురళీధరచార్యుల నేతృత్వంలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. వర్గల్ విద్యాధరి క్షేత్రంలోని కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వంలో ఏకాదశి వేడుకలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోశ్ఛరణల మధ్య పూజలు నిర్వహించారు.
చేర్యాల: ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలను సోమవారం చేర్యాల, కొమురవెల్లి మండలాల ప్రజలు జరుపుకున్నారు. వేణుగోపాలస్వామి, అయ్యప్ప, సత్యనారాయణస్వామి ఆలయంతో పాటు మండలం ముస్త్యాల, నాగపురి గ్రామాల్లోని వేణుగోపాలస్వామి ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. నాగపురిలో జరిగిన వేడుకల్లో ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, చేర్యాలలో మున్సిపల్ చైర్‌పర్సన్ స్వరూపారాణి పూజలు నిర్వహించారు.
రాయపోల్: రాయపోల్, దౌల్తాబాద్ మండలాల్లో సోమవారం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను నిర్వహించారు. ఇందుప్రియాల్‌లోని రామాలయంలో ఆలయ ధర్మకర్త అన్నారెడ్డి సుభా్‌షరెడ్డి దంపతుల చేతులమీదుగా వేదపండితులు విష్ణు సహస్రనామ పారాయణ హోమం నిర్వహించారు. దౌల్తాబాద్‌లో వెంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. రాయపోల్ మండలం రాంసాగర్‌లో రాములవారిని భక్తులు వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు.
గజ్వేల్: గజ్వేల్ పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరి యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ ప్రతా్‌పరెడ్డి, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
మద్దూరు: ఉమ్మడి మద్దూరు మండలంలో ముక్కోటి ఏకాదశి పర్వదినోత్సవాన్ని మండల ప్రజలు సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. దూళిమిట్ట మండలంలోని బెక్కల్ రామలింగేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారుజామునే భక్తులు పూజలు నిర్వహించారు.
హుస్నాబాద్ టౌన్: హుస్నాబాద్ పట్టణంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజితతో పాటు భక్తులు హాజరై ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. లక్ష్మీనారాయణస్వామి ఉత్సవ ప్రతిమ భక్తులను ఆకర్షించింది. అనంతరం అలివేలు మంగ భజన మండలివారు భజన కీర్తనలు విష్ణుసహస్ర నామాలను భక్తిశ్రద్ధలతో పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య, వైస్ చైర్‌పర్సన్ అయిలేని అనిత, ఎస్‌ఐ శ్రీధర్ పాల్గొన్నారు.
కొండపాక: కొండపాక మండలంలోని ఆనంద నిలయం కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. సత్యసాయి కళాశాల విద్యార్థినులు స్వామివారిని దర్శించుకుని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పూజారి గోవర్ధన మాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుకునూరుపల్లి రామాలయంలో, సిరిసినగండ్ల వేణుగోపాలస్వామి, దుద్దెడ వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో మహిళలు పూజలు నిర్వహించారు.
సిద్దిపేట రూరల్: సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరుబండఫై స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ వైదిక నిర్వాహకులు కలకుంట్ల కృష్ణమాచారి, వీణాచారి, వేణుగోపాలాచారి, నారాయణాచార్యులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లె నరే్‌షగౌడ్, గ్రామ పెద్దలు కోడూరి శ్రీనివాస్, సుధాకర్, బండచర్లపల్లి సర్పంచ్ వీణదశరథం, ఎల్లం, తదితరులు స్వామివారి సేవలో పాల్గొని పల్లకీ మోశారు.
నంగునూరు: నంగునూరు మండలంలోని నంగునూరు, పాలమాకుల, కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. నంగునూరు వెంకటేశ్వరస్వామి ఆలయ వ్యవస్థాపకులు మంగువారి ధార్మిక సేవా సంస్థ అధ్యక్షుడు మంగు రాధాకిషన్‌రావు నేతృత్వంలో భక్తులకు అల్పాహారాన్ని అందించారు.
దుబ్బాక/మిరుదొడ్డి: దుబ్బాక బాలాజీ వేంకటేశ్వరాలయానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయంలో వెండిపీఠను బీఆర్‌ఎస్ నాయకులు మద్దుల నాగేశ్వర్‌రెడ్డి సమర్పించారు. దుబ్బాక మున్సిపల్ చైర్‌పర్సన్ గన్నె వనితారెడ్డి దంపతులు, కోఆప్షన్ ఆస స్వామి దంపతులు, ప్రజాప్రతినిధులు ఆలయాన్ని సందర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చెరుకు శ్రీనివా్‌సరెడ్డి దంపతులను ఆలయ కమిటీ సన్మానించింది. దుబ్బాక మండలంలోని వేణుగోపాలస్వామి, దుంపలపల్లి వేంకటేశ్వరాలయం, కూడవెళ్లి వేణుగోపాలస్వామి ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. మిరుదొడ్డి మండలం మోతె గ్రామంలోని వేంకటేశ్వరాలయానికి భక్తులు తరలివచ్చారు.
తొగుట: తొగుట మండలం వెంకట్రావ్‌పేట గ్రామంలోని వేంకటేశ్వరాలయం, వేణుగోపాలస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు అన్నిఏర్పాట్లు చేశారు.
బెజ్జంకి: బెజ్జంకి మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవింద నామస్మరణలతో ఆలయాలు మార్మోగాయి.
Updated Date - 2023-01-02T23:09:05+05:30 IST