ఫోర్టిఫైడ్ రైస్ మిక్సింగ్‌తో రేషన్ బియ్యం సరఫరా
ABN, First Publish Date - 2023-05-28T23:00:30+05:30
మద్దూరు, మే 28: ప్రభుత్వం పోషకారలోపాన్ని అధిగమించేందుకు కృత్రిమంగా తయారుచేసిన బలవర్ధకమైన ఫోర్టిఫైడ్ రైస్‌ను రేషన్ బియ్యంలో కలిపి అందించనున్నది.
మద్దూరు, మే 28: ప్రభుత్వం పోషకారలోపాన్ని అధిగమించేందుకు కృత్రిమంగా తయారుచేసిన బలవర్ధకమైన ఫోర్టిఫైడ్ రైస్‌ను రేషన్ బియ్యంలో కలిపి అందించనున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే జిల్లాలకు రేషన్ బియ్యంలో కలిపిన ఫోర్టిఫైడ్ రైస్‌ను అందిస్తుండగా.. తాజాగా సిద్దిపేట జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోని రేషన్‌షాపులకు వచ్చేనెల నుంచి ఈ రైస్‌ను సరఫరా చేయనున్నారు. సాధారణ బియ్యం మాదిరిగా ఉండే ఈ ఫోర్టిఫైడ్ బియ్యం గింజలు నీళ్లల్లో వేస్తే తేలియాడతాయి. గతంలో బియ్యం సంచుల్లో ప్లాస్టిక్ బియ్యం కలుస్తున్నాయని సామాజిక మాద్యమాల్లో దుష్ప్రచారం జరిగింది. మనం తినే బియ్యంలోనే పిండి పదార్థాలతో మిటమిన్ బి12, ఐరన్, పోలిక్ యాసిడ్ వంటివన్నీ సంయుక్తంగా కలిపి కృత్రిమంగా తయారుచేసిన ఫోర్టిఫైడ్ రైస్‌ను రేషన్ బియ్యంలో మిక్సింగ్ చేసి లబ్ధిదారులకు అందించనున్నారు. దీంతోపాటు పాఠశాల విద్యార్థులకు ఈ ఫోర్టిఫైౖడ్ రైస్‌ను కలిపిన బియ్యాన్ని పాఠశాల ప్రారంభానికి ముందు అందించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బలవర్ధకమైన ఈ ఫోర్టిఫైడ్ రైస్‌ను కలిపిన బియ్యాన్ని గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు అందిస్తున్నారు. ఈ బియ్యాన్ని తీసుకోవడం ద్వారా పిల్లలో రక్తహీనత(ఎనిమియా)ను తగ్గించే పరిస్థితులున్నాయి. కృత్రిమంగా తయారుచేసిన ఈ గింజల్లో ప్రతి 100 గ్రాముల ఫోర్టిఫైడ్ రైస్‌లో మిటమిన్ బి12లో 0.125 మిల్లీ గ్రాములు, ఐరన్ 4.25 మిల్లీ గ్రాములు, పోలిక్ యాసిడ్‌లో 12.5 మిల్లీ గ్రాముల బలవర్ధకమైన పోషక పదార్థాలు ఉంటాయని చెబుతున్నారు. వచ్చేనెల నుంచి ఈ బియ్యాన్ని సరఫరా చేస్తామని చేర్యాల సివిల్ సప్లయ్ గోదాం ఆపరేటర్ అనిత తెలిపారు.
Updated Date - 2023-05-28T23:00:30+05:30 IST