‘బీఆర్‌ఎస్’ గూటికి చేరితేనే మనుగడ
ABN, First Publish Date - 2023-02-22T23:54:04+05:30
రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకుంటున్న నాయకులు అక్రమాల విషయంలో కలిసిమెలిసి వ్యవహరిస్తున్నారు. వినడానికి కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నా అక్షర సత్యం ఇది.
లేదంటే ఇబ్బందులకు గురిచేస్తున్న నాయకులు
కంది మండలంలో చిత్రమైన రాజకీయాలు!!
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, ఫిబ్రవరి 22: రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకుంటున్న నాయకులు అక్రమాల విషయంలో కలిసిమెలిసి వ్యవహరిస్తున్నారు. వినడానికి కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నా అక్షర సత్యం ఇది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి ఆనుకుని ఉన్న కంది మండలంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తే ఔరా! అనిపించకపోదు. కందిలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక వర్గం పేదలకు ఇళ్ల స్థలాల కోసం రెవెన్యూ అధికారులు అయిదెకరాల భూమిని పట్టాల రూపంలో ఇచ్చారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారెవరూ ఇళ్లు నిర్మించుకోలేదు. ఆ భూమి అంతా ఖాళీగా ఉండడం చూసిన ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకుడొకరు వారి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. అసైన్డ్ భూమిని అమ్మడం, కొనడం చట్ట విరుద్ధమైనా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. కొనుగోలు చేసిన సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, స్థానిక ఎమ్మెల్యే అదే పార్టీకి చెందిన వారవడం, కొనుగోలు చేసిన నాయకుడు ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడు కావడంతో రెవెన్యూ అధికారులు చూస్తూ ఊర్కుండిపోయారు. అనంతర పరిణామాలలో ఈ భూమి విలువ కోట్లలో పెరిగింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, అఽధికారంలోకి రావడం ఒకదాని వెంట ఒకటిగా జరిగిపోయాయి. అసైన్డ్ భూమిలో సదరు కాంగ్రెస్ నాయకుడు పెద్ద ఎత్తున వ్యాపార కార్యకలాపాలు సాగిస్తుండడం బీఆర్‌ఎస్ నాయకులకు మింగుడు పడలేదు. ఇంకేముంది ఆ వ్యాపార కార్యాకలాపాలపై రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. వ్యాపార కార్యకలాపాలను స్తంభింపజేశారు. దాంతో సదరు కాంగ్రెస్ నాయకుడు బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులుతో రాయబారాలు నడిపారు. ఆ నాయకుడు కాంగ్రె్‌సకు గుడ్‌బై చెప్పి బీఆర్‌ఎ్‌సలో చేరారు. అంతేకాదు బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులకు లక్షల రూపాయలు ముట్టజెప్పినట్టు ఆరోపణలున్నాయి. ఫలితంగా ఆ నాయకుడి వ్యాపార కార్యకలాపాలు యథావిదిగా సా గడం మొదలయ్యాయి. బీఆర్‌ఎ్‌సలో చేరే వరకు కక్షకట్టినట్టు వ్యవహరించిన రెవెన్యూ అధికారులు ఆ తర్వాతి నుంచి ఇక త మకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం.
వివాదాస్పద వెంచర్లలోనూ
వివాదాస్పదంగా మారిన వెంచర్ల భూములను పరిష్కరించడంలోనూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరికీ వెళ్లే మార్గంలో మలుపు వద్ద ఒక వెంచర్ ఏర్పాటైంది. వెంచర్ నిర్వాహకులు నక్షాబాటను ఆక్రమించి, రోడ్డు వేసుకున్నారు. అలాగే చేర్యాలలో ఏర్పాటు చేసిన ఒక వెంచర్ నిర్వాహకులు సుమారు అరెకరా ప్రభుత్వ భూమిని ఆక్రమించి, పది ఫీట్ల బండ్లబాటను ఇరవై ఫీట్లుగా మార్చారు. కాశీపూర్‌లోనూ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మించుకుంటున్న వారెందరో ఉన్నారు. ఈ రకంగా భూముల ఆక్రమణల వెనుక బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి దందాలు చేస్తుండడంతో అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదు.
బీజేపీ నేతను కూడా
మండలంలోని ఒక బీజేపీ ప్రజాప్రతినిధిని కూడా బీఆర్‌ఎస్ నేతలు ఇలాగే దారికి తెచ్చుకున్నారు. కంది మండల రెవెన్యూ కార్యాలయానికి సమీపంలో ఉన్న ఒక గ్రామశివారులో పలువురు ప్రభుత్వ స్థలం కబ్జా చేసి ఇళ్లు నిర్మించుకోసాగారు. అక్కడి ప్రజాప్రతినిధి బీజేపీ నాయకుడు కావడంతో తహసీల్దార్ తన సిబ్బందితో వెళ్లి సుమారు 25 ఇళ్లను కూల్చి వేయించారు. అధికారుల నుంచి ఎదురైన ఈ రకమైన వేధింపులు భరించలేక సదరు బీజేపీ ప్రజాప్రతినిధి బీఆర్‌ఎ్‌సలో చేరిపోయారు. ఇక ఆ ప్రాంతంలో యథేచ్చగా ప్రభుత్వ భూ ముల ఆక్రమణ జరుగుతున్నా ఆపే అధికారులు ఎవరూ కనిపించడం లేదు. అధికార పార్టీ హవా అంటే ఇది కదా అని ఆ పార్టీ నాయకులు అనిపించుకుంటున్నారు!!
Updated Date - 2023-02-22T23:54:05+05:30 IST