ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Republic Day: రిపబ్లిక్ డే ఉత్సవాలపై మరో ట్విస్ట్ .. ఈసారి వేడుకలు ఎక్కడంటే...?

ABN, First Publish Date - 2023-01-25T20:27:28+05:30

రిపబ్లిక్ డే ఉత్సవాలపై మరో ట్విస్ట్ .. ఈసారి వేడుకలు ఎక్కడంటే...?

Telangana Republic Day
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం రాజ్‌భవ‌న్‌లోనే జరగనున్నాయి. ఉదయం ఏడు గంటలకు గవర్నర్ జెండా ఆవిష్కరిస్తారు. రాజ్ భవన్‌లోనే రిపబ్లిక్ డే పోలీస్ పరేడ్ ఉంటుంది. ఉదయం 6.50 నుంచి రాజ్ భవన్‌లో పరేడ్ ప్రారంభమౌతుంది. అరగంట పాటు పరేడ్ కొనసాగుతుంది.

అంతకుముందు తెలంగాణ (Telangana)లో రిపబ్లిక్‌ డే (Republic Day) వేడుకలపై హైకోర్టు (High Court) కీలక తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకలు అధికారికంగా నిర్వహించాలని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు (Interim Orders) ఇచ్చింది. గణతంత్ర వేడుకలను రాజ్‌భవన్‌ (Raj Bhavan)కే ఎందుకు పరిమితం చేశారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్ (Guidelines) పాటిస్తారా? లేదా? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. గణతంత్ర వేడుకలకు కోవిడ్ (Covid) కారణం చూపడం సరికాదని తెలిపింది. ప్రభుత్వం తప్పకుండా పరేడ్‌‌తో కూడిన వేడుకలు నిర్వహించాలని, పరేడ్ ఎక్కడ నిర్వహించాలో ప్రభుత్వం నిర్ణయించుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టులో సైతం గణతంత్ర వేడుకలు జరుపుతామని న్యాయస్థానం పేర్కొంది.

మరోవైపు మూడు నెలలైతే పోయే ప్రభుత్వానికి రాష్ట్రపతి పాలన ఎందుకని కేసీఆర్ సర్కారును ఉద్దేశించి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్కు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదని, రిపబ్లిక్ డే వేడుకలను సైతం రద్దు చేసే పరిస్థితికి చేరుకున్నారని చెప్పారు. రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పరేడ్గ్రౌండ్లో రిపబ్లిక్ వేడుకలు జరపడం ఆనవాయితీ అని అన్ని రాష్ట్రాలు ఈ సంప్రదాయాలు కొనసాగిస్తున్నాయని కిషన్రెడ్డి చెప్పారు. అయితే అంబేడ్కర్ను, రాజ్యాంగాన్ని కేసీఆర్ అవమానపరిచారని చెప్పారు. కేంద్రం నిర్వహించే సమావేశాలకు కేసీఆర్ డుమ్మా కొడుతున్నారని, రాష్ట్రపతి, గవర్నర్ను అవమానపరుస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నాయన్నారు. కేసీఆర్ విచిత్రమైన, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ది వితండవాదం, నిజాం ఆలోచన అని తెలంగాణను భ్రష్ణు పట్టిస్తున్నారని చెప్పారు. ప్రధాని, గవర్నరు వస్తే కనీస గౌరవం కూడా చూపరని కిషన్ రెడ్డి ఆరోపించారు. కల్వకుంట్ల కుంటుంబం కారణంగా తెలంగాణ పరువు పోతోందన్నారు. అధికారం కోసమే కేసీఆర్ కుటుంబం పరితపిస్తోందని చెప్పారు. ప్రతిపక్షాలపై తెలంగాణ ప్రభుత్వం తీరు దారుణంగా ఉందన్నారు. దేశానికో విధానం, రాష్ట్రానికో విధానం ఉండదని, అందరు సీఎంలకు ఉండే విధానమే.. కేసీఆర్కు ఉంటుందన్నారు. తెలంగాణ సర్కార్ తీరును ఖండిస్తున్నామన్నారు. కొన్ని కనీస మర్యాదలు, గౌరవాలు పాటించాలని చెప్పారు. గణతంత్ర దినోత్సవం జరపాలని ప్రజలు కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్ వైఖరిని తెలంగాణ మేధావులు, విద్యార్థులు అర్థం చేసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.

గణతంత్ర దినోత్సవ వేళ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌లో ఇచ్చే ఎట్ హోమ్ కార్యక్రమానికి కేసీఆర్ డుమ్మా కొడతారా? తాజా పరిస్థితులు చూస్తుంటే ఔననే సమాధానం వస్తోంది. గణతంత్ర దినోత్సవ వేళ ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి సంబంధించి గవర్నర్ తమిళిసై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో పాటు ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. ఏడాదిన్నరగా కేసీఆర్ రాజ్‌భవన్‌లో నిర్వహించే కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. వాస్తవానికి గవర్నర్‌తో ఆయనకు పొసగడం లేదు కూడా. మొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చిన సందర్భంలో మాత్రమే కేసీఆర్, తమిళిసై మధ్య మాటలు కలిశాయి. ఆ తర్వాత మళ్లీ సేమ్ టు సేమ్ సీన్. ప్రగతి భవన్‌కు, రాజ్‌భవన్‌కు మధ్య విభేదాలు అలాగే కొనసాగుతున్నాయి. దీంతో కేసీఆర్ గవర్నర్ ఇచ్చే ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది.

తెలంగాణలో గవర్నర్‌కు సంబంధించి సీఎం ప్రోటోకాల్ పాటించట్లేదని తమిళిసై ఇటీవలే ఆరోపించారు. తెలంగాణ సర్కార్‌ ఎందుకు ప్రోటోకాల్ పాటించట్లేదో చెప్పాలన్నారు. గవర్నర్‌ అంటే కేసీఆర్‌ ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు అని తమిళిసై ప్రశ్నించారు. ఇది అహంకారం కాక మరేంటని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రోటోకాల్ ఎందుకు పాటించట్లేదో సమాధానమివ్వాలన్నారు. అప్పుడు మాత్రమే రాజ్యాంగ వ్యవస్థపై మాట్లాడాలన్నారు. తాను పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ప్రొటోకాల్ తనకు తెలుసన్నారు. గవర్నర్ వ్యవస్థను ఎలా హేళన చేస్తారని తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ గవర్నర్‌ను అవమానించారని ఆమె ఆరోపించారు.

తెలంగాణలో రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య సంబంధాలు ఇటీవల దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం, గవర్నర్‌ వ్యవస్థలు రెండూ ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ప్రభుత్వం.. గవర్నర్‌ ప్రసంగం లేకుండానే నిర్వహించింది. దీంతో ఇందుకు ప్రతీకారం అన్నట్లుగా.. బడ్జెట్‌కు ఆమోదం తెలపకుండా నిలువరించే అధికారం ఉన్నా... ప్రజల సంక్షేమం దృష్ట్యా ఆమోదం తెలిపానని అప్పట్లో గవర్నర్‌ తీవ్రంగా స్పందించారు. అయితే గత శాసనసభ సమావేశాలకు కొనసాగింపుగానే సభను నిర్వహిస్తున్నామని, గవర్నర్‌ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించుకోవచ్చంటూ ప్రభుత్వ వర్గాలు లీకులిచ్చాయి. గవర్నర్‌ కూడా వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వం పంపించిన ప్రసంగ పాఠాన్ని కాకుండా తన సొంత ప్రసంగ పాఠాన్ని చదివారు. దాంతో ఇరు వర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది. రాజ్‌భవన్‌కు, ప్రగతిభవన్‌కు మధ్య విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. నిజానికి ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డిని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రతిపాదిస్తే... గవర్నర్‌ తిరస్కరించినప్పటి నుంచే ఇరు వ్యవస్థల మధ్య దూరం మొదలైంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఒకరిపై ఒకరు పైచేయి సాధించే ప్రయత్నం చేశారు. గవర్నర్‌ వ్యవస్థను ఏమాత్రం కేర్‌ చేయనట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ వస్తోంది.

గతేడాది రాజ్‌భవన్‌లో జనవరి 26న జరిగిన గణతంత్ర దినోత్సవానికి సీఎం కేసీఆర్‌, ఆయన మంత్రివర్గ సహచరులెవరూ హాజరుకాలేదు.

Updated Date - 2023-01-25T20:29:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising