Aaryajanani: రామకృష్ణ మఠం ద్వారా గర్భిణులకు మార్గదర్శనం.. వర్నిలో వర్క్‌షాప్
ABN, First Publish Date - 2023-02-24T20:38:03+05:30
ఆర్యజనని ఈ నెల 26వ తేదీ ఆదివారం నిజామాబాద్ వర్నిలో వర్క్‌షాప్ నిర్వహించనుంది.
నిజామాబాద్: హైదరాబాద్ రామకృష్ణ మఠం ద్వారా గర్భిణులకు మార్గదర్శనం చేస్తున్న ఆర్యజనని ఈ నెల 26వ తేదీ ఆదివారం నిజామాబాద్ వర్నిలో వర్క్‌షాప్ నిర్వహించనుంది. మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్‌లో ఉదయం తొమ్మిదిన్నర నుంచి ఒంటి గంట వరకూ వర్క్ షాప్ నిర్వహిస్తారు.
ఓ మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు రెండేళ్ళ వయసు వచ్చే వరకు అంటే 1,000 రోజుల వరకు గర్భిణులు పాటించవలసిన సూచనలను గైనకాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు గర్భిణులకు వివరిస్తారు.
ప్రసవానికి ముందు యోగా, గాఢమైన విశ్రాంతి, శ్వాసించడం, ధ్యానం వంటివాటికి సంబంధించిన శక్తిమంతమైన చిట్కాలను తెలియజేస్తారు. బిడ్డను పోషించడం, చనుబాలు ఇవ్వడం, శిశువుకు పోషకాహారం గురించి సమగ్ర సమాచారం ఇస్తారు. గర్భధారణ, మాతృత్వం గురించి ప్రయోజనకరమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు నిపుణులతో మాట్లాడవచ్చునని, అనుభవజ్ఞులైన దంపతులు, తల్లులతో సంభాషించవచ్చునని ఆర్యజనని నిర్వాహకులు తెలిపారు.
వర్క్‌షాపునకు హాజరుకావాలనుకునేవారు https://aaryajanani.org/ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 9603906906 వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో కూడా వర్క్‌షాపులు నిర్వహించాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు.
వర్నిలో జరిగే ఆర్యజనని వర్క్‌షాప్‌లో పాల్గొనాలనుకునేవారు 9440466055 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు 8309339090 నెంబర్ ద్వారా సంప్రదించవచ్చని రామకృష్ణ సేవా సమితి, కోటగిరి, నిజామాబాద్ నిర్వాహకులు తెలియజేశారు.
Updated Date - 2023-02-24T20:38:08+05:30 IST