ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth reddy: సచివాలయంలోకి రేవంత్‌కు నో ఎంట్రీ

ABN, First Publish Date - 2023-05-02T03:40:57+05:30

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి నూతన సచివాలయం విషయంలో చేదు అనుభవం ఎదురైంది. సోమవారం ఆయన సచివాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అందుకు అనుమతి లేదంటూ పోలీసులు ఏకంగా కిలోమీటర్‌ ముందే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మునిసిపల్‌ ముఖ్య కార్యదర్శిని కలిసేందుకు వెళ్లిన పీసీసీ చీఫ్‌

టెలిఫోన్‌ భవన్‌ వద్దే అడ్డగింత

ఔటర్‌ లీజు సమాచారంపై దరఖాస్తుకు వెళ్తున్నానన్న రేవంత్‌

మునిసిపల్‌ కమిషనరేట్‌కు ఆయనను తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీఐ కింద ఆఫీసులో దరఖాస్తు

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే లీజు టెండర్లపై విచారణ: రేవంత్‌

హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి నూతన సచివాలయం విషయంలో చేదు అనుభవం ఎదురైంది. సోమవారం ఆయన సచివాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అందుకు అనుమతి లేదంటూ పోలీసులు ఏకంగా కిలోమీటర్‌ ముందే అడ్డుకున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌ వసూళ్లను 30 ఏళ్లపాటు లీజుకు ఇచ్చిన అంశంపై అధికారిక సమాచారం కోసం మునిసిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను కలిసి ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకుంటానంటూ రేవంత్‌రెడ్డి సచివాలయానికి బయలు దేరారు. అయితే పోలీసులు ఆయన వాహనాన్ని టెలిఫోన్‌ భవన్‌ వద్దే అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రేవంత్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్లపాటు లీజుకు ఇచ్చిన అంశంలో భారీగా అక్రమాలు జరిగాయని, దీనిపై తాను మునిసిపల్‌, హెచ్‌ఎండీఏ అధికారులను కలిసి సమాచార హక్కు కింద దరఖాస్తు చేసేందుకు వెళుతున్నానని పోలీసులతో రేవంత్‌ చెప్పారు. ఒక ఎంపీ అయిన తనకు సచివాలయంలోకి వెళ్లేందుకు ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. తాను ఒక్కడినే వెళ్లి అధికారులను కలుస్తానని, అవసరమైతే పోలీసు వాహనంలోనే తీసుకెళ్లి తీసుకురావాలని కోరారు. అయినా పోలీసులు అంగీకరించలేదు. దీంతో.. ఓఆర్‌ఆర్‌ లీజులో అవినీతి బయట పడుతుందనే ప్రభుత్వం పోలీసులతో తనను అడ్డుకుంటోందని రేవంత్‌ ఆరోపించారు. తానొక్కడినే వెళ్లి ముఖ్య కార్యదర్శిని కలుస్తానన్నా పోలీసుల అభ్యంతరమేంటని, రోడ్డుపైనే తనను అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు.

సీఎంను కలిసేందుకు కాదు కదా..

ఈ సందర్భంగా సెంట్రల్‌ జోన్‌ డీసీపీతో రేవంత్‌ మాట్లాడారు. అపాయింట్‌మెంట్‌ తీసుకుని వెళ్లడానికి తానేమీ ముఖ్యమంత్రిని కలిసేందుకో, మంత్రిని కలిసేందుకో వెళ్లడం లేదని, ఆర్టీఐ ద్వారా సమాచారం కోసం వెళుతున్నానని చెప్పారు. అయితే అరవింద్‌కుమార్‌ కార్యాలయం మాసాబ్‌ట్యాంక్‌ వద్ద ఉన్న మునిసిపల్‌ శాఖ కమిషనరేట్‌ నుంచి ఇంకా పూర్తిగా సచివాలయానికి తరలి రాలేదని, ఆర్టీఐ దరఖాస్తును అక్కడే ఇవ్వాలని రేవంత్‌ను పోలీసులు కోరారు. టెలిఫోన్‌ భవన్‌ నుంచి మునిసిపల్‌ శాఖ కమిషనరేట్‌కు వారే స్వయంగా తీసుకెళ్లారు. దీంతో ఆ కార్యాలయంలోని సెక్షన్‌ ఆఫీసర్‌కు తన దరఖాస్తును రేవంత్‌ అందజేశారు. ఓఆర్‌ఆర్‌ లీజు టెండర్‌ ప్రక్రియ, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్‌ లిమిటెడ్‌కు ఇచ్చిన టెండర్లు, ఆ టెండర్‌ ప్రక్రియలో పాల్గొన్న కంపెనీలు, టెక్నికల్‌ బిడ్‌లో అర్హత సాధించిన కంపెనీల వివరాలు తెలపాల్సిందిగా కోరారు. అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఓఆర్‌ఆర్‌ను ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.6696 కోట్లతో నిర్మించిందని గుర్తు చేశారు. ఆ డబ్బును తిరిగి రాబట్టుకునేందుకు హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసి టోల్‌ విధానాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. దానిపై ప్రస్తుతం రోజుకు రూ.2 కోట్ల చొప్పున ఏటా రూ.50 కోట్ల మేరకు టోల్‌ ఆదాయం వస్తోందన్నారు. అలాంటి ఆదాయం ఉన్న ఓఆర్‌ఆర్‌ను రూ.7,388 కోట్లకు 30 ఏళ్లపాటు ముంబైకి చెందిన ఐఆర్‌బీ అనే సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టిందని తెలిపారు.

ఏటా రూ.246 కోట్లకే..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.100 కోట్లు దాటని ఓఆర్‌ఆర్‌ టోల్‌ ఆదాయం.. ప్రస్తుతం రూ.750 కోట్లకు చేరుకుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. అలాంటిది ఏటా రూ.246 కోట్లకే ముంబై కంపెనీకి ప్రభుత్వం అప్పగించిందని తప్పుబట్టారు. 30 ఏళ్ల లీజును పరిగణనలోకి తీసుకుంటే ఇందులో రూ.వేల కోట్ల అవినీతి జరుగుతోందని ఆరోపించారు. బంగారు బాతులాంటి ఓఆర్‌ఆర్‌ను మూడు నెలల్లో రద్దయ్యే ప్రభుత్వం 30 ఏళ్లకు తెగనమ్మిందని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం టెండర్లపై విచారణ చేయిస్తామని ప్రకటించారు. కాగా, ఇకపై సచివాలయం నుంచే పాలన జరుగుతుందని చెప్పిన కేసీఆర్‌.. అంబేడ్కర్‌ సిద్ధాంతాల గురించి ఉపన్యాసం ఇచ్చారని, కానీ.. 24 గంటలు తిరగకముందే దానిని మరిచి పోయారని అన్నారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ ఎమ్మెల్యేలు, ఎంపీలను సచివాలయానికి రాకుండా అడ్డుకున్నది లేదన్నారు. ఓఆర్‌ఆర్‌ టోల్‌ కు సంబంధించిన వివరాలు ఆర్టీఐ ద్వారా అడిగేందుకు సచివాలయానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారన్నారు. నయా తెలంగాణ ఈదీ అమీన్‌ను ప్రజలు సచివాలయంలో గొయ్యి తీసి పాతి పెడతారని పేర్కొన్నారు. 30 ఏళ్ల పాటు ఓఆర్‌ఆర్‌ టోలు లీజు రూ.వేల కోట్ల కుంభకోణమని ఆరోపించారు. ఓఆర్‌ఆర్‌ లీజుపై అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మంత్రి కేటీఆర్‌ను జైల్లో పెట్టే వరకూ పోరాడతామన్నారు.

నేటి నుంచి కర్ణాటకలో రేవంత్‌ ప్రచారం

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మంగళవారం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. బీదర్‌, గుల్బర్గాల్లో జరిగే ప్రచార కార్యక్రమాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పాల్గొంటారు. మూడు రోజుల అనంతరం బెంగళూరులో జరిగే ప్రచార కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు.

Updated Date - 2023-05-02T03:42:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising