ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Siricilla: ఉద్యోగాలు లేక యువత బలవన్మరణాలు

ABN, First Publish Date - 2023-03-20T02:25:59+05:30

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలులేక నిరుద్యోగ యువత బలవన్మరణాలకు పాల్పడతున్నారని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సిరిసిల్ల టౌన్‌, మార్చి19: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలులేక నిరుద్యోగ యువత బలవన్మరణాలకు పాల్పడతున్నారని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా బీవైనగర్‌లో రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి చిటికెన నవీన్‌ కుటుంబ సభ్యులను ఆయన ఆదివారం పరామర్శించారు. అనంతరం స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని, అందువల్లే ఐటీ మంత్రి కేటీఆర్‌ ఇలాకాలో నిరాశ నిస్పృహలకు లోనై నవీన్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. నవీన్‌ కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్ర్‌గ్రేషియా, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

ప్రత్యేక చట్టం తీసుకొచ్చి, ప్రైవేట్‌ సంస్థల్లో తెలంగాణ నిరుద్యోగులకు 50శాతం రిజర్వేషన్లు క ల్పించాలని, 2023-24 బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి నిధులు మంజూరు చేయాలన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీలపై వాస్తవాలు బయటకు రావాలంటే హైకోర్టు సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-03-20T02:26:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising