ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP state president Kishan Reddy : భూములు అమ్మితేనే బతుకు!

ABN, First Publish Date - 2023-08-31T02:28:23+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరు ‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌కో డాంటే’ అన్నట్లుగా ఉందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. రోజువారీ ఖర్చులకు భూములు అమ్మితే తప్ప నడవని దుస్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. మద్యం అమ్మితేగానీ

మద్యం పారితేనే ఉద్యోగులకు జీతాలు

రోజువారీ ఖర్చులకూ నిధుల్లేని దుస్థితి

ఓ చేతిలో ఆసరా పింఛను..

మరో చేతిలో బీరు, బ్రాందీ!

‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌కో డాంటే’

అన్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శ

పార్టీలోకి చెన్నమనేని వికా్‌స దంపతులు

హైదరాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరు ‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌కో డాంటే’ అన్నట్లుగా ఉందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. రోజువారీ ఖర్చులకు భూములు అమ్మితే తప్ప నడవని దుస్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. మద్యం అమ్మితేగానీ ఉద్యోగులకు జీతాలివ్వలేని దీన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. వేములవాడ నియోజకవర్గానికి చెందిన డాక్టర్‌ చెన్నమనేని వికా్‌సరావు, డాక్టర్‌ దీప దంపతులు బీజేపీలో చేరారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారికి కిషన్‌రెడ్డి బీజేపీ కండువా కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. డాక్టర్‌ వికా్‌సరావు దంపతుల రాకతో వేములవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పార్టీ బలోపేతం అవుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలకు గ్యాస్‌ ధరలపై మాట్లాడే నైతిక హక్కు లేదని, వారి తీరు గురివింద గింజ మాదిరిగా ఉందని విమర్శించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్‌ ధరలపై వ్యాట్‌ తగ్గిస్తే ఇక్కడ కేసీఆర్‌ ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ భూములను ఇష్టానుసారం అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆరు నెలల ముందే మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించిన ఘనత కేసీఆర్‌ సర్కారుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఒక చేతిలో ఆసరా పింఛను పెట్టి మరో చేతిలో బీరు, బ్రాందీపెడుతున్న వ్యక్తి కేసీఆర్‌ అని దుయ్యబట్టారు. పేదలకు ఇళ్లు కట్టడానికి స్థలం లేదంటూ.. కోకాపేటలో బీఆర్‌ఎ్‌సకు 11 ఎకరాలు, కంటోన్మెంట్‌లో కాంగ్రె్‌సకు 10 ఎకరాల భూమిని కేటాయించారని ఆరోపించారు. ఈ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనన్నారు. రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సతో పాటు మజ్లిస్‌ కూడా కుటుంబ పార్టీయేనని చెప్పారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. వంశపారంపర్య రాజకీయాలకు తావు లేకుండా ప్రధాని మోదీ దేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలుపుతున్నారని చెప్పారు. డాక్టర్‌ వికా్‌సరావు, దీప దంపతులు రూ.కోట్ల ఆదాయాన్ని వదులుకొని ప్రజా సేవ కోసం బీజేపీలో చేరారని తెలిపారు.

ఇతర పార్టీల్లో మాత్రం రూ.వందల కోట్లు సంపాదించుకునేందుకే చేరుతుంటారని అన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడిన కుటుంబానికి చెందిన వ్యక్తి చెన్నమనేని వికా్‌సరావు అన్నారు. బీఆర్‌ఎ్‌సను అడ్డుకునే ఏకైక పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. గ్యాస్‌ ధరలు పెరిగాయని మొరిగిన నేతలు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. పేదలపై భారం పడొద్దనే ప్రధాని మోదీ రాఖీ కానుకగా గ్యాస్‌ సిలిండర్‌ ధరను తగ్గించారని చెప్పారు. ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతూ.. వికా్‌సరావు దంపతుల చేరికతో ఉత్తర తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతుందన్నారు. బీజేపీలో చేరడం తన జీవితంలో మర్చిపోలేని రోజని వికా్‌సరావు చెప్పారు. బీజేపీతో తనకు విడదీయరాని బంధం ఉందని, ఎందరో అతిరథ మహారథులను చాలా దగ్గరి నుంచి చూసిన వ్యక్తినని తెలిపారు. 15 ఏళ్లకు పైగా వైద్య వృత్తిలో ఉన్నామని.. ఇకపై రాజకీయంగా ప్రజలకు సేవ చేస్తామని చెప్పారు.

Updated Date - 2023-08-31T02:29:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising