ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య!

ABN, First Publish Date - 2023-04-07T03:10:16+05:30

కుటుంబ కలహాలు దంపతుల ఆత్మహత్యకు కారణమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

జనగామ టౌన్‌, ఏప్రిల్‌ 6: కుటుంబ కలహాలు దంపతుల ఆత్మహత్యకు కారణమయ్యాయి. భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, ఆమె మృతిని తట్టుకోలేక ఎస్సై అయిన భర్త తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జనగామ జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపెల్లి జిల్లాలోని గోదావరిఖని పట్టణవాసి అయిన కాసర్ల శ్రీనివాస్‌ (55) జనగామ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య స్వరూప (50)తో కలిసి జనగామ వెంకన్నకుంట కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ దంపతులకు కుమారులు రవితేజ, భార్గవ్‌ ఉన్నారు. మూడునెలల క్రితమే పెద్ద కొడుకు వివాహం జరిగింది. కొన్నాళ్లుగా శ్రీనివాస్‌, స్వరూప మధ్య ఆర్థికపరమైన అంశాల కారణంగా గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో స్వరూప గురువారం తెల్లవారుజామున బాత్‌రూంలో చీరతో ఉరివేసుకుంది. ఉదయం 8 గంటలకు పాలుపోసే వ్యక్తి ఇంటికి వచ్చి ఎంత పిలిచినా ఎవరూ పలకకపోవడంతో ఆయన పక్కనున్న వారిని పిలిచారు. వారు మరో తలుపు నుంచి పిలిచేందుకు వెళ్లగా అక్కడే ఉన్న బాత్రూంలో స్వరూప ఉరి వేసుకుని కనిపించింది. అప్పటికి నిద్రలో ఉన్న ఎస్సై శ్రీనివా్‌సను లేపి విషయం చెప్పారు. అనంతరం సమాచారం తెలుసుకున్న డీసీపీ సీతారాం, ఏసీపీ దేవేందర్‌రెడ్డి, సీఐ నాగబాబు ఘటన స్థలానికి చేరుకున్నారు. భార్య చనిపోవడంతో ఎస్సై శ్రీనివాస్‌ గుండెలవిసేలా రోదించారు. తలను గోడకేసి బాదుకోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. అక్కడున్న వారు పసుపు రాసి సముదాయించారు. ఈ క్రమంలో ఏసీపీ దేవేందర్‌రెడ్డి రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో మీడియాను బయటికి పంపించారు. కాసేపు ఎస్సై శ్రీనివా్‌సతో ఏసీపీ మాట్లాడారు. ఆ సమయంలో ఏసీపీతో ఇద్దరు ఎస్సైలు, వార్డు కౌన్సిలర్‌ జక్కుల అనిత భర్త వేణుమాధవ్‌ ఉన్నారు. అక్కడున్న పోలీసులు వరండాలోకి రాగానే బాత్రూం వెళ్లొస్తానని వేణుమాధవ్‌కు చెప్పి బెడ్‌రూంలో ఉన్న రివాల్వర్‌ను పట్టుకుని ఎస్సై శ్రీనివాస్‌ బాత్‌రూంలోకి వెళ్లారు. కొన్ని క్షణాల్లోనే తలలో కాల్చుకుని అక్కడికక్కడే మృతి చెందారు. బుల్లెట్‌ శబ్దం విన్న పోలీసులు లోపలికి వెళ్లి చూసేసరికి ఎస్సై రక్తపు మడుగులో కనిపించారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు భారీగా ఘటనాస్థలానికి చేరుకున్నారు.

Updated Date - 2023-04-07T03:10:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising