ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raitanna Kannera : మాస్టర్‌ ప్లాన్‌పై రైతన్న కన్నెర్ర

ABN, First Publish Date - 2023-01-06T03:24:48+05:30

మాస్టర్‌ ప్లాన్‌పై రైతుల ఆందోళన తారా స్థాయికి చేరింది. ధర్నాలు, నిరసనలతో కామారెడ్డి అట్టుడికింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట భారీ ధర్నా

ఇండస్ట్రియల్‌ జోన్‌ రద్దు చేయాలని డిమాండ్‌

రైతులు, పోలీసుల మధ్య తోపులాట.. ఉద్రిక్తత

పలువురు రైతులు, ఒక కానిస్టేబుల్‌కు గాయాలు

ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్‌, టీజేఎస్‌ మద్దతు

వినతిపత్రం తీసుకోని కలెక్టర్‌.. దిష్టిబొమ్మకు

అందజేసి ఆందోళన విరమించిన రైతులు

నేడు కామారెడ్డి నియోజకవర్గ బంద్‌కు పిలుపు

కామారెడ్డి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): మాస్టర్‌ ప్లాన్‌పై రైతుల ఆందోళన తారా స్థాయికి చేరింది. ధర్నాలు, నిరసనలతో కామారెడ్డి అట్టుడికింది. రెండు ఎకరాల భూమి ఇండస్ట్రియల్‌ జోన్‌లోకి వెళ్తోందన్న ఆవేదనతో రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడంతో అన్నదాతలు గురువారం కామారెడ్డిలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అడ్లూర్‌, కామారెడ్డి, అడ్లూర్‌ ఎల్లారెడ్డి, టెక్రియాల్‌, ఇల్చిపూర్‌, లింగాపూర్‌ గ్రామాలకు చెందిన రైతులు, తమ కుటుంబ సభ్యులతో కలిసివచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సీఎ్‌సఐ గ్రౌండ్‌ నుంచి సుమారు 3 వేల మంది ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌కు తరలివెళ్లారు. మాస్టర్‌ ప్లాన్‌ను రద్దు చేయాలని, ఇండస్ట్రియల్‌ జోన్‌ను తొలగించే విషయమై కలెక్టర్‌ బయటకు వచ్చి ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా చేపట్టారు. ఒక దశలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి.. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విధ్వంసానికి పాల్పడితే కేసులు నమోదు చేస్తామని కామారెడ్డి ఏఎస్పీ అనోన్య, డీఎస్పీ సోమనాథం బెదిరించడంతో రైతులు మరింత ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోవడంతో పలువురు రైతులతోపాటు ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. కొందరు రైతులు సొమ్మసిల్లి పడిపోయారు. చివరకు ఎస్పీ శ్రీనివా్‌సరెడ్డి అక్కడకు చేరుకుని రైతులను సముదాయించి కలెక్టర్‌తో మాట్లాడిస్తానని నచ్చజెప్పారు. అయితే, కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ వచ్చి వినతిపత్రం తీసుకునే వరకూ కదిలేది లేదంటూ కలెక్టరేట్‌ ఎదుటే రైతులు భీష్మించి కూర్చున్నారు. ఎట్టకేలకు రాత్రి 9.30 గంటల తర్వాత కలెక్టర్‌ దిష్టిబొమ్మకు వినతిపత్రం అందజేసిన తర్వాత ఆందోళన విరమిస్తున్నట్లు రైతులు ప్రకటించారు. కలెక్టర్‌ తీరుకు నిరసనగా శుక్రవారం కామారెడ్డి నియోజకవర్గ బంద్‌కు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు కామారెడ్డి నియోజకవర్గ ప్రజలతో పాటు అన్ని వర్గాల వారు సహకరించాలని రైతులు కోరారు.

భూములు అమ్ముకునేందుకే

రైతులకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్‌, టీజేఎస్‌ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు మాట్లాడుతూ మాస్టర్‌ప్లాన్‌ పేరిట భూములను అమ్ముకునేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లోని మూతపడ్డ పరిశ్రమల భూములను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని మండిపడ్డారు. ఇండస్ట్రియల్‌ జోన్‌లోని భూములను రెసిడెన్షియల్‌ జోన్‌లోకి మార్చేందుకు మంత్రి కేటీఆరే సంతకాలు పెట్టారని ధ్వజమెత్తారు. కామారెడ్డిలో రైతుల భూముల జోలికి వస్తే.. నిజామాబాద్‌లో కవితకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. రెండు పంటలు పండే భూములను ఇండస్ట్రియల్‌ జోన్‌లో ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. కాగా, రైతుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు ఎంపీ ధర్మపురి అర్వింద్‌ గురువారం రాత్రి కామారెడ్డికి వస్తుండగా.. రామారెడ్డి రోడ్డులో పోలీసులు అడ్డుకుని రాజంపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు.

అడ్లూర్‌ ఎల్లారెడ్డి పాలకవర్గం రాజీనామా

సదాశివనగర్‌: రైతులకు మద్దతుగా అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు గురువారం రాజీనామా చేశారు. గ్రామ సర్పంచ్‌ జానకి భర్త జనార్దన్‌రెడ్డిపై గ్రామానికి చెందిన పలువురు రైతులు దాడికి యత్నించారు. దీంతో ఆయన ఓ దుకాణంలోకి వెళ్లి దాక్కున్నారు. పోలీసులు.. ఆయన్ను ఇంటికి తరలించారు.

అది ప్రభుత్వ హత్యే: సంజయ్‌

మాస్టర్‌ ప్లాన్‌ విషయంలో ప్రభుత్వ మూర్ఖ వైఖరికి ఒక రైతు బలి కావడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డికి చెందిన రైతు పయ్యావుల రాములుది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్యేనని స్పష్టం చేశారు. రైతు మృతదేహం తరలింపు విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. పోలీసులు బీఆర్‌ఎ్‌సకు బానిసలుగా మారి రైతులను కొడుతుంటే కలెక్టర్‌ బయటకు రాకపోవడం దారుణమని డీకే అరుణ మండిపడ్డారు. జిల్లా మేజిస్ట్రేట్లు కూడా తమ అధికారాన్ని కేసీఆర్‌ కాళ్ల దగ్గర పెట్టారని విమర్శించారు. రాములు ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని షబ్బీర్‌ విమర్శించారు.

వ్యక్తిగత కారణాలతోనే రైతు ఆత్మహత్య: కలెక్టర్‌ పాటిల్‌

వ్యక్తిగత కారణాల వల్లే రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నాడని కామారెడ్డి కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ తెలిపారు. గురువారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు రాములుకు పలు సమస్యలు ఉన్నాయని తెలిపారు. మాస్టర్‌ ప్లాన్‌ వల్లేనంటూ అతడు చనిపోయాడంటూ పలువురు ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. మాస్టర్‌ ప్లాన్‌పై అభ్యంతరాలు ఉంటే తెలపాలని రైతులతోపాటు ప్రజలనూ కోరారు. అన్నీ పరిశీలించి ఫైనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను సిద్ధం చేస్తామని ప్రకటించారు.

Updated Date - 2023-01-06T03:41:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising