ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాధారణ చార్జీలతోనే సంక్రాంతి బస్సులు

ABN, First Publish Date - 2023-01-06T03:32:39+05:30

సంక్రాంతికి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలే అమలు చేయనున్నట్లు టీఎ్‌సఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

7 నుంచి 14 వరకు 4,233 ప్రత్యేక బస్సులు

తిరుగు ప్రయాణానికీ ఒకే సారి రిజర్వేషన్‌ చేయించుకుంటే 10శాతం రాయితీ: సజ్జనార్‌

హైదరాబాద్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతికి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలే అమలు చేయనున్నట్లు టీఎ్‌సఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం ఈ నెల 7 నుంచి 14 వ తేదీ వరకు 4,233 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు. అమలాపురం 125, కాకినాడ 117, కందుకూరు 83, నర్సాపురం 14, పోలవరం 51, రాజమండ్రి 40, రాజోలు 20, ఉదయగిరి 18, విశాఖపట్నం 65, నెల్లూరు 20, ఒంగోలు 13, గుంటూరు 12, విజయవాడ 9 ప్రత్యేక బస్సులను నడుస్తాయని పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల్లో 585 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించినట్లు వివరించారు. ఒకే సారి తిరుగు ప్రయాణానికి సైతం సీటు రిజర్వ్‌ చేసుకున్న వారికి.. ఆ చార్జీలో 10శాతం రాయితీ కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 11 నుంచి 14 వరకు ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం ఈ నెల 16 నుంచి 18వరకు మరో 212 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. బస్‌భవన్‌లో గురువారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన.. సంక్రాంతి ప్రత్యేక బస్సులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారంతా ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రద్దీ ప్రాంతాల్లో డిపో మేనేజర్‌, ఆపై అధికారులు పరిస్థితిని సమీక్షించాలన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్స్‌డ్‌ టికెట్‌ బుకింగ్‌ను 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచామని, జూన్‌ వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు.

Updated Date - 2023-01-06T03:32:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising