ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana High Court : తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు అడిషనల్‌ జడ్జిలు

ABN, First Publish Date - 2023-07-29T03:07:12+05:30

తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు అడిషనల్‌ జడ్జిలు నియమితులయ్యారు. జిల్లా జడ్జి (ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌) కె.సుజనతో పాటు హైకోర్టు న్యాయవాదులు అలిశెట్టి లక్ష్మీనారాయణ, జూకంటి అనిల్‌కుమార్‌లను అడిషనల్‌ జడ్జిలుగా

సుప్రీం కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం

జిల్లా జడ్జి కె.సుజనతో పాటు న్యాయవాదులు అలిశెట్టి లక్ష్మీనారాయణ, జూకంటి అనిల్‌ కుమార్‌కు అవకాశం

హైదరాబాద్‌, జూలై 28(ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు అడిషనల్‌ జడ్జిలు నియమితులయ్యారు. జిల్లా జడ్జి (ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌) కె.సుజనతో పాటు హైకోర్టు న్యాయవాదులు అలిశెట్టి లక్ష్మీనారాయణ, జూకంటి అనిల్‌కుమార్‌లను అడిషనల్‌ జడ్జిలుగా నియమించాలని ఈ నెల 14న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు ఈ మేరకు వారి నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్‌ జడ్జిలుగా వీరు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని పేర్కొంది. త్వరలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.

జ్యుడీషియల్‌ ఆఫీసర్స్‌ కోటాలో సుజన

ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా పనిచేస్తున్న కలాసికం సుజనను జ్యుడీషియల్‌ ఆఫీసర్స్‌ కోటాలో హైకోర్టు అడిషనల్‌ జడ్జిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన మధుసూదన్‌, ప్రమీల దంపతులకు 1970 మార్చి 10న సుజన జన్మించారు. 1997లో బార్‌ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌ అయ్యారు. 2010లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. విధులు నిర్వర్తిస్తూనే.. జిల్లా జడ్జి పరీక్షల్లో మెరిట్‌ సాధించి.. కరీంనగర్‌, నిజామాబాద్‌, సిటీ సివిల్‌ కోర్టు జడ్జిగా పనిచేశారు. రిజిస్ట్రార్‌గా, వివిధ ఉమ్మడి జిల్లా కోర్టులకు చీఫ్‌ జడ్జిగా, జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది.

సుదీర్ఘ అనుభవం అలిశెట్టి లక్ష్మీనారాయణ సొంతం

హైకోర్టు న్యాయవాదిగా 26 ఏళ్ల అనుభవం అలిశెట్టి లక్ష్మీనారాయణ సొంతం. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మంచి పేరు తెచ్చుకున్నారు. రిట్‌ పిటిషన్‌లు, ఆర్బిట్రేషన్‌, సివిల్‌ లిటిగేషన్‌లు, కమర్షియల్‌ కేసులు వాదించడంలో గుర్తింపు పొందారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం మెడోరా గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ.. గంగాధర్‌, రాజుభాయ్‌ దంపతులకు 1968 మే 13న జన్మించారు. నిజామాబాద్‌ ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1994లో ఉమ్మడి ఏపీ బార్‌ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌ చేసుకున్నారు. పలు ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల తరఫున స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు.

రాజ్యాంగ కేసుల్లో నిపుణుడు అనిల్‌కుమార్‌

జూకంటి అనిల్‌కుమార్‌కు హైకోర్టు న్యాయవాదిగా 20 ఏళ్లపైగా అనుభవం ఉంది. ట్యాక్స్‌, సివిల్‌, క్రిమినల్‌, సర్వీస్‌ కేసులతో పాటు రాజ్యాంగ పరమైన కేసుల్లో నిపుణులు. ప్రస్తుతం రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ స్టాడింగ్‌ కౌన్సిల్‌గా పనిచేస్తున్నారు.

Updated Date - 2023-07-29T03:07:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising