Big Breaking : వరంగల్ ప్రీతి మృతిపై వీడిన మిస్టరీ.. అసలేం జరిగిందో పోస్టుమార్టం రిపోర్టుతో తేల్చేసిన సీపీ రంగనాథ్..
ABN, First Publish Date - 2023-04-21T18:38:30+05:30
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనం రేపిన వరంగల్ ప్రీతి మెడికో (Warangal Medico Preethi) మృతి కేసుపై ఇన్నాళ్లుగా నెలకొన్న మిస్టరీ వీడింది...
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనం రేపిన వరంగల్ ప్రీతి మెడికో (Warangal Medico Preethi) మృతి కేసుపై ఇన్నాళ్లుగా నెలకొన్న మిస్టరీ వీడింది. రెండు నెలలు అయినా ప్రీతి ఆత్మహత్య చేసుకుందా..? లేకుంటే హత్యనా..? అనేదానిపై తేలకపోగా తాజాగా పోస్టుమార్టమ్ రిపోర్టుతో కీలక విషయాలు బయటికొచ్చాయి. పీజీ డాక్టర్ ప్రీతిది ఆత్మహత్యేనని వరంగల్ సీపీ రంగనాథ్ (Warangal CP) తేల్చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో ఈ విషయం తేలిందని సీపీ స్పష్టం చేశారు. ప్రీతి ఆత్మహత్యకు ప్రధాన కారణం సైఫే అని.. అతని వేధింపుల వల్లనే ఈ ఘటన జరిగిందని తేల్చారు. వేధింపులు తట్టుకోలేక ప్రీతి పాయిజన్ తీసుకుందని పోలీసులు తేల్చారు. అంతేకాదు.. ఈ కేసుకు సంబంధించి వారం, పదిరోజుల్లో చార్జ్‌షీటు దాఖలు చేస్తామని సీపీ రంగనాథ్ తెలిపారు. అయితే.. సీపీ ప్రకటనపై ప్రీతి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కాగా.. గురువారం నాడే ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన సైఫ్‌కు నిబంధనలతో కూడిన బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. 24 గంటల వ్యవధిలోనే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది. రెండు నెలలుగా ఖమ్మం జిల్లా జైలులో రిమాండులో ఉన్న సైఫ్‌కు బుధవారమే షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. అయితే పూచీకత్తు, సంతకాల విషయంలో జాప్యం జరగడం విడుదల ఆలస్యమైంది. సాధారణ కోర్టు వాయిదా ఉండడంతో సైఫ్‌ని పోలీసులు గురువారం వరంగల్ కోర్టులో హాజరుపరిచారు. బెయిల్ ఉత్తర్వుల కాపీ వరంగల్ కోర్టు నుంచి గురువారం సాయంత్రం రావడంతో సైఫ్‌ను కోర్టు నుంచి ఖమ్మం జైలుకు తీసుకు వచ్చి సంతకాలు తీసుకుని సాయంత్రం ఆరుగంటల సమయంలో సైఫ్‌ను విడుదల చేశారు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య 16 వారాల పాటు కేసు విచారణ అధికారి వద్ద హాజరు కావాలని సూచించారు. అంతేకాదు.. మృతురాలి కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేయకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం మరుక్షణమే బెయిల్‌ను రద్దు చేయాలని ఉత్తర్వుల్లో పోలీసులు కోరవచ్చని న్యాయమూర్తి తేల్చిచెప్పారు.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
Medico Preethi : డాక్టర్ ప్రీతి ఘటనలో 11 అనుమానాలు.. అపస్మారక స్థితిలో ఉండగా ..!?
******************************
Medico Preethi : ప్రీతి కేసులో నోరు విప్పిన సైఫ్.. సంచలన విషయాలు వెలుగులోకి.. కీలకంగా మారిన బ్యాగ్!
******************************
YS Jagan Reddy : ప్చ్.. వైసీపీలో అంతా అయోమయం.. సడన్‌గా ఇంత మౌనమెందుకో.. భయం మొదలైందా..!?
******************************
BRS No Bidding : వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు కేసీఆర్ సర్కార్ బిడ్ వేయకపోవడం వెనుక పెద్ద కథే ఉందిగా.. గులాబీ బాస్ కంగుతిన్నారా..!?
******************************
YSRCP : తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎం వైఎస్ జగన్ మూడాఫ్ అయ్యారా.. ఈ దెబ్బతో..!
******************************
Updated Date - 2023-04-21T18:40:53+05:30 IST