రిపబ్లిక్ డే ఏర్పాట్ల పరిశీలన
ABN, Publish Date - Jan 24 , 2024 | 12:32 AM
స్థానిక తలారిసింగి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఈ నెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను మంగళవారం ఐటీడీఏ పీవో వి.అభిషేక్ పరిశీలించారు.
పాడేరు, జనవరి 23(ఆంధ్రజ్యోతి): స్థానిక తలారిసింగి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఈ నెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను మంగళవారం ఐటీడీఏ పీవో వి.అభిషేక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాట్లపై ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. వేదిక, స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అనువుగా ఉండేలా అన్నీ ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఈఈ డీవీఆర్‌ఎం రాజు, డీఈఈ పి.అనుదీప్, టీడబ్ల్యూ డీడీ కొండలరావు, ఏటీడబ్ల్యూవో ఎల్.రజని, ప్రధానోపాధ్యాయుడు ఆర్.జాన్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 25 , 2024 | 05:08 PM