ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Woman Reincarnation: వింత ఘటన.. చనిపోయిన ఆరు రోజుల తర్వాత శవపేటికలో నుంచి లేచి కూర్చున్న మహిళ

ABN, Publish Date - Jan 05 , 2024 | 09:24 PM

చనిపోయిన వ్యక్తులు తిరిగి జీవం పోసుకోవడాన్ని ఎప్పుడైనా చూశారా? ఇలాంటివన్నీ సినిమాల్లోనే జరుగుతుంటాయి. అఫ్‌కోర్స్.. రియల్ లైఫ్‌లోనూ కొన్ని అరుదైన సంఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ..

Woman Reincarnation: చనిపోయిన వ్యక్తులు తిరిగి జీవం పోసుకోవడాన్ని ఎప్పుడైనా చూశారా? ఇలాంటివన్నీ సినిమాల్లోనే జరుగుతుంటాయి. అఫ్‌కోర్స్.. రియల్ లైఫ్‌లోనూ కొన్ని అరుదైన సంఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ.. నిమిషాల వ్యవధిలోనే కొందరు తిరిగి బతికారు. ‘క్లినికల్లీ డెడ్’ అని భావించిన వ్యక్తుల్లో కొద్దిమంది మాత్రమే కొన్ని నిమిషాల అనంతరం తిరిగి జీవం పోసుకున్నారు. కానీ.. చైనాలో మాత్రం నమ్మశక్యం కాని ఓ చమత్కారం వెలుగు చూసింది. నిమిషాలు కాదు, గంటలు కాదు.. ఏకంగా ఆరు రోజుల తర్వాత ఒక మహిళ శవపేటికలో నుంచి లేచి కూచింది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. చైనాలోని గ్యాంగ్జి ప్రావిన్స్‌లో దిమ్మతిరిగే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..


లీ జుఫెంగ్ అనే 95 ఏళ్ల మహిళ తలకు గాయాలతో తన ఇంటిలో పడి ఉంది. ఎప్పుడూ హుషారుగా ఉంటూ అందరినీ పలకరించే ఈ వృద్ధురాలు.. ఆరోజు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు వెళ్లి చూశారు. ఆమె గాయాలతో కింద పడిపోయి ఉండటంతో.. వెంటనే మంచం మీద పడుకోబెట్టి, ఆమెని బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ.. ఆమె కళ్లు తెరవలేదు. శరీరం చల్లగా లేదు కానీ.. శ్వాస మాత్రం తీసుకోవడం లేదు, అలాగే స్పృహలోకి రాలేదు. దీంతో.. ఆ వృద్ధురాలు నిద్రలోనే చనిపోయిందేమోనని అంతా అనుకున్నారు. ఆమెకు ఎవరూ లేకపోవడంతో.. చుట్టుపక్కల వారే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఆమెని ఒక శవపేటికలో ఉంచారు. అయితే.. స్నేహితులు గానీ, ఇతర బంధువులు గానీ చివరిచూపు చూసేందుకు వస్తారన్న ఉద్దేశంతో వెంటనే అంత్యక్రియలు చేయలేదు. శవపేటిలో ఆ వృద్ధురాల్ని అలాగే ఉంచేశారు. అయితే.. ఆమె కోసం ఏ ఒక్కరూ రాలేదు.

ఆరు రోజులు చూసిన తర్వాత శవపేటికని పూడ్చేద్దామని చుట్టుపక్కలవారు లీ జుఫెంగ్ ఇంటికి వచ్చారు. అయితే.. ఆ శవపేటిక ఖాళీగా ఉండటం చూసి వాళ్లకు మైండ్ బ్లాక్ అయ్యింది. వెంటనే తేరుకొని మృతదేహం ఎక్కడికి పోయిందని వెతకడం ప్రారంభించారు. ఇంతలో కిచెన్ రూంలో నుంచి వాళ్లకు శబ్దాలు వినిపించాయి. ఏంటా అని లోనికి వెళ్లి చూసి.. ఒక స్టూల్‌పై లీ జుఫెంగ్ కూర్చొని, ఆహారం వండుతూ కనిపించింది. ఇది చూసి.. వాళ్లందరూ ఖంగుతిన్నారు. చనిపోయిన మహిళ ఎలా బతికిందంటూ భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి వాళ్లంతా తమతమ ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే.. ఈ రకమైన మరణాన్ని వైద్యులు కృత్రిమ మరణంగా పేర్కొంటున్నారు. అంటే.. శరీరం శ్వాస తీసుకోకపోయినా, శరీరం చల్లబడదని అంటున్నారు. ఏదేమైనా.. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతోందో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.

Updated Date - Jan 05 , 2024 | 09:24 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising