ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Javier Milei: వేదికపై అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ పాడు పని.. ప్రియురాలికి ముద్దు పెట్టి..

ABN, Publish Date - Jan 02 , 2024 | 04:43 PM

ఆయన ఒక దేశానికి అధ్యక్షుడు. అలాంటి హోదాలో ఉన్న వ్యక్తి బహిరంగ ప్రదేశాల్లో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. తాను నడుచుకునే తీరు నలుగురికీ ఆదర్శప్రాయంగా నిలవాలి. కానీ.. అర్జెంటీనా అధ్యక్షుడు చేసిన పని మాత్రం...

Javier Kisses Fatima Florez: ఆయన ఒక దేశానికి అధ్యక్షుడు. అలాంటి హోదాలో ఉన్న వ్యక్తి బహిరంగ ప్రదేశాల్లో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. తాను నడుచుకునే తీరు నలుగురికీ ఆదర్శప్రాయంగా నిలవాలి. కానీ.. అర్జెంటీనా అధ్యక్షుడు చేసిన పని మాత్రం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసింది. ఒక వేదికపై ఆయన తన ప్రియురాలితో కలిసి పాడు పని చేశాడు. తనని కోట్లాదిమంది చూస్తున్నారన్న విషయాన్ని ఏమాత్రం గ్రహించకుండా.. ప్రియురాలితో అదర చుంబనాల్లో తేలిపోయారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

గురువారం మార్ డెల్ ప్లాటాలోని రాక్సీ థియేటర్‌లో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ (53) ప్రియురాలు ఫాతిమా ఫ్లోరెజ్ సంగీత ప్రదర్శన చేసింది. ‘ఫాతిమా 100%’ పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్‌కి ప్రత్యేకంగా టిక్కెట్టు కొనుగోలు చేసి మరీ జేవియర్ హాజరయ్యారు. ఫాతిమా ప్రదర్శన ముగిసిన అనంతరం జేవియర్ వేదిక మీదకు వెళ్లి కాసేపు ప్రసంగించారు. తాను మాట్లాడిన తర్వాత ప్రియురాలిని దగ్గరగా తీసుకొని.. ఒక్కసారిగా లిప్‌లాక్ ఇచ్చేశారు. దాంతో.. అక్కడున్న జనం ఒక్కసారిగా ఖంగుతింది. రెండు, మూడు క్షణాల తర్వాత మరోసారి వాళ్లిద్దరు ముద్దు పెట్టుకున్నారు. బహిరంగ ప్రదేశంలో వీళ్లు ఇలా ముద్దు పెట్టుకోవడంతో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రియురాలిపై ఎంత ప్రేముంటే మాత్రం.. పబ్లిక్ ప్లేస్‌లో మరీ ఇంతలా రెచ్చిపోవాలా? ఒక అధ్యక్షుడు చేయాల్సిన పనేనా ఇది? అని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.


అసలు ఫాతిమా ఫ్లోరెజ్ ఎవరు?

ఫాతిమా ఫ్లోరెజ్ (42) ఒక ప్రసిద్ధ హాస్యనటి, వేషధారి. బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్‌లోని పొరుగున ఉన్న ఒలివోస్‌లో 1981లో ఈమె జన్మించింది. నటన, డ్యాన్స్, సింగింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఆమె.. తనకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 2001లో మార్కోస్‌ని వివాహం చేసుకుంది. అతనితో 22 ఏళ్ల పాటు దాంపత్య జీవితాన్ని కొనసాగించింది. కొన్ని కారణాల వల్ల భర్తతో విడిపోయింది. కట్ చేస్తే.. ఒక టాక్ షోలో భాగంగా ఆమె జేవియర్‌ని కలిసింది. అదే వీరి ప్రేమకు పునాది వేసింది. అలా కలుసుకున్న వీళ్లిద్దరు ప్రేమలో పడ్డారు. ఈ జంట బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం ఇదే మొదటిసారి కాదు. నవంబర్‌లో దేశ అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వాళ్లు బహిరంగంగా అదర చుంబనాల్లో మునిగితేలారు.

Updated Date - Jan 02 , 2024 | 04:43 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising