ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Israel Hamas War: గాజాతో యుద్ధం ముగిసేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని

ABN, Publish Date - Jan 07 , 2024 | 09:10 PM

అక్టోబర్ 7వ తేదీన హమాస్ (పాలస్తీనా ఉగ్రవాద సంస్థ) చేసిన మెరుపుదాడులతో ప్రారంభమైన ఇజ్రాయెల్, గాజా మధ్య యుద్ధం.. ఇంకా కొనసాగుతూనే ఉంది. హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్..

Benjamin Netanyahu Clarity On Gaza War: అక్టోబర్ 7వ తేదీన హమాస్ (పాలస్తీనా ఉగ్రవాద సంస్థ) చేసిన మెరుపుదాడులతో ప్రారంభమైన ఇజ్రాయెల్, గాజా మధ్య యుద్ధం.. ఇంకా కొనసాగుతూనే ఉంది. హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హమాస్‌ని అంతమొందించాలన్న లక్ష్యంతో వైమానిక దాడులు, గ్రౌండ్ ఆపరేషన్స్‌తో దూసుకుపోతోంది. దీంతో.. ఈ యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందనే ప్రశ్న మిస్టీరియస్‌గా మారింది. ఒకవైపు కొన్ని దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల సంఘాలు కాల్పుల విరమణకు పిలుపునివ్వాలని కోరుకుంటే.. మరోవైపు తాము తగ్గేదే లేదంటూ ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది.


ఇలాంటి తరుణంలో తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ తన లక్ష్యాలను సాధించేవరకూ ఈ యుద్ధం ఆగదని, ముఖ్యంగా హమాస్‌ని పూర్తిగా సర్వనాశనం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మూడు నెలల క్రితం హమాస్ తమపై భయంకరమైన మారణకాండకు పాల్పడిందని పేర్కొన్నారు. హమాస్‌ని పూర్తిగా నిర్మూలించి, బందీలను సురక్షితంగా తీసుకురావాలని తమ ప్రభుత్వం ఇజ్రాయెల్ భద్రతా దళాలకు (ఐడీఎఫ్) ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. అంతేకాదు.. ఇజ్రాయెల్‌పై గాజా మరెప్పుడూ దాడులు చేయకుండా చర్యలు తీసుకోవాలని తన ఆర్మీని ఆదేశించానని వెల్లడించారు.

హమాస్‌ని ఎప్పటికీ ఉపేక్షించేది లేదన్న నెతన్యాహు.. ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో భద్రతను పునరుద్ధరించేదాకా పోరాడుతూనే ఉంటామని క్లారిటీ ఇచ్చారు. అప్పటిదాకా ఇతర విషయాలన్నింటినీ పక్కన పెట్టి.. సంపూర్ణ విజయం సాధించేవరకు ముందుకు సాగుతామని అన్నారు. యునైటెడ్ ఫోర్సెస్‌గా దూసుకెళ్లాలని తన ఆర్మీని పిలుపునిచ్చారు. చూస్తుంటే.. హమాస్‌ని ఎట్టి పరిస్థితుల్లో అయినా అంతమొందించాలని ఇజ్రాయెల్ కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. అదే జరిగితే.. ఈ యుద్ధంలో యావత్ గాజా తుడిచిపెట్టుకోవడం ఖాయమని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ యుద్ధంలో 20 వేలకు పైగా గాజా వాసులు మృతి చెందారు. యుద్ధం నడిచేకొద్దీ.. మరణాల సంఖ్య మరింత పెరగడం తథ్యమని అంటున్నారు.

Updated Date - Jan 07 , 2024 | 09:10 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising