ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Frederik X: క్వీన్ మార్గరెత్ తర్వాత డెన్మార్క్ కొత్త రాజుగా ఫ్రెడరిక్ X

ABN, Publish Date - Jan 14 , 2024 | 09:06 PM

83 ఏళ్ల మార్గరెత్ 2 దాదాపు 900 సంవత్సరాలలో సింహాసనాన్ని స్వచ్ఛందంగా వదులుకున్న మొదటి డానిష్ చక్రవర్తిగా నిలిచారు. ఈ క్రమంలో తన కుమారుడిని తర్వాత రాజుగా ప్రకటించారు.

83 ఏళ్ల డెన్మార్క్‌(Denmark) క్వీన్ మార్గరెత్ 2(Queen Margrethe II) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం తన చారిత్రాత్మక పదవీ విరమణపై సంతకం చేసి ఆమె కుమారుడు ఫ్రెడరిక్ X(Frederik X) వెంటనే రాజుగా ప్రకటించారు. ఈ క్రమంలో 900 ఏళ్ల చరిత్రలో సింహాసనాన్ని స్వచ్ఛందంగా వదులుకున్న మొదటి డానిష్ చక్రవర్తిగా ఆమె నిలిచారు. రాజ కుటుంబీకులు, డెన్మార్క్ ప్రభుత్వ సభ్యులు కూర్చున్న టేబుల్ వద్ద డాక్యుమెంట్‌పై ఆమె సంతకం చేశారు.

ఆ తర్వాత గది నుంచి బయటకు వేళ్లే క్రమంలో గాడ్ సేవ్ ది కింగ్ తెలిపారు. ఆ క్రమంలోనే తన స్థానంలోకి రావాలని తన కుమారుడికి సైగ చేశారు. ఇక మార్గరెత్ 2 పదవీ విరమణ తర్వాత కింగ్ 55 ఏళ్ల ఫ్రెడరిక్ X సింహాసనాన్ని అధిష్టించారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు రాజవంశ వారసత్వం జరుగుతున్న కోపెన్‌హాగన్‌లో ప్యాలెస్ వెలుపల పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ దేశం అర్ధ శతాబ్దానికి పైగా మొదటి రాచరిక వారసత్వాన్ని అనుభవించింది.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: International Students: ఇకపై కెనడాకు వెళ్లే విద్యార్థులకు మరిన్ని కష్టాలు!

ఈ క్రమంలో ఆమె కుమారుడు సింహాసనాన్ని అధిష్టించడంలో ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే మార్గరెత్ నూతన సంవత్సర ప్రసంగం సందర్భంగా ఆరోగ్య కారణాలను చూపుతూ పదవి నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించారు. ఇక డానిష్‌తో పాటు ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ భాషలు మాట్లాడే ఫ్రెడరిక్ ఆర్హస్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.

Updated Date - Jan 14 , 2024 | 09:06 PM

Advertising
Advertising