Hijack: హైజాక్‌కు గురైన నౌకలో భారతీయులు సేఫ్.. హైజాకర్లపై కాల్పులు
ABN, Publish Date - Jan 06 , 2024 | 08:33 AM
సోమాలియా సరిహద్దులో హైజాక్ కి(Hijacked Cargo Ship) గురైన కార్గో నౌక "ఎంవీలిలా నార్‌ఫోర్క్"ను ఎట్టకేలకు భారత నేవీ అధికారులు గుర్తించారు. అందులో 15 మంది భారతీయులు ప్రయాణిస్తున్నారని వారు తెలిపారు. వారి జాడ గుర్తించడంతో 15 మంది భారతీయులతోపాటు 21 మంది క్రూ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
ఢిల్లీ: సోమాలియా సరిహద్దులో హైజాక్ కి(Hijacked Cargo Ship) గురైన కార్గో నౌక "ఎంవీలిలా నార్‌ఫోర్క్"ను ఎట్టకేలకు భారత నేవీ అధికారులు గుర్తించారు. అందులో 15 మంది భారతీయులు ప్రయాణిస్తున్నారని వారు తెలిపారు. వారి జాడ గుర్తించడంతో 15 మంది భారతీయులతోపాటు 21 మంది క్రూ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు. నౌక లైబీరియా నుంచి వెళ్తుండగా సోమాలియా ప్రాంతంలో దుండగులు హైజాక్ చేశారు.
విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తం అయింది. ఎప్పటికప్పుడు స్థానిక అధికారులతో చర్చలు జరుపుతూ నౌక జాడలు కనిపెట్టేందుకు ప్రయత్నించింది. ఎట్టకేలకు నౌక జాడ కనుక్కుంది. ఇందుకోసం చెన్నై వార్ షిప్ లను కూడా రంగంలోకి దింపారు అధికారులు. డ్రోన్లు తదితర యంత్రాల సాయంతో జాడ తెలుసుకున్నట్లు వారు వివరించారు. నౌకను చుట్టుముట్టి హైజాక్ చేసిన వారిపై కాల్పులు జరిపారు. తప్పించుకోవడానికి వారు సిటాడెల్ లో దాక్కున్నారని వివరించారు.
అతి కష్టంమీద జరిపిన కాల్పుల్లో వారు మృతి చెందినట్లు ఇండియన్ నేవీ ఓ ప్రకటనలో తెలిపింది. నేవీ అధికార ప్రతినిధి వివేక్ మాధ్వాల్ మాట్లాడుతూ.. భారతీయులతోపాటు 21 మంది ఇతర సిబ్బందిని రక్షించామని తెలిపారు. హైజాక్ సమాచారాన్ని బ్రిటిష్ మిలిటరీ ఆర్గనైజేషన్, యూకే మారిటం ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. సముద్రంలో వెళ్తున్న నౌకలను ట్రాక్ చేయడమే వీటి పని.
భారత నావికాదళ ప్రధాన కార్యాలయం సముద్రంలో కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైజాక్ చేసిన ఓడను చేరుకున్న తర్వాత అందులో ఉన్న సముద్రపు దొంగలకు మార్కోస్ గట్టి హెచ్చరిక చేసింది. హైజాక్ చేసిన ఓడను వెంటనే వదిలివేయమని వారిని కోరింది. చివరికి దాడులు జరిపింది. నౌకలో ఉన్న సిబ్బందితో ఎప్పటికప్పుడు మాట్లాడటం వల్లే ఆపరేషన్ విజయవంతం అయిందని నేవీ అధికారులు వెల్లడించారు. ఈ విధానం సముద్రపు ముప్పులను త్వరితగతిన గుర్తించి పరిష్కరించడంలో ఉపయోగపడుతుందని అన్నారు.
Updated Date - Jan 06 , 2024 | 10:04 AM