ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

War: ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధానికి 100 రోజులు.. కుటుంబాలను వదిలిపెట్టాలంటూ గాజా పౌరుల డిమాండ్

ABN, Publish Date - Jan 15 , 2024 | 11:11 AM

ఇజ్రాయెల్ - హమాస్(Israeil - Hamas) యుద్ధంతో ఆ నేలలో నెత్తుటేళ్లు పొంగుతున్నాయి. జనవరి 15నాటికి యుద్ధం ప్రారంభమై 100 రోజులు పూర్తయింది. అక్టోబర్ 7 న ప్రారంభమై యుద్ధం వేల సంఖ్యలో అమాయకపు ప్రజల ప్రాణాలను బలికొంది. శాంతి చర్చలకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఒక గాజా పౌరుడు, IDF అధికారి మధ్య ఆడియో రికార్డింగ్‌ను విడుదల చేసింది.

జెరూసలెం: ఇజ్రాయెల్ - హమాస్(Israeil - Hamas) యుద్ధంతో ఆ నేలలో నెత్తుటేళ్లు పొంగుతున్నాయి. జనవరి 15నాటికి యుద్ధం ప్రారంభమై 100 రోజులు పూర్తయింది. అక్టోబర్ 7 న ప్రారంభమై యుద్ధం వేల సంఖ్యలో అమాయకపు ప్రజల ప్రాణాలను బలికొంది. శాంతి చర్చలకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఒక గాజా పౌరుడు, IDF అధికారి మధ్య ఆడియో రికార్డింగ్‌ను విడుదల చేసింది. అందులో గాజా పౌరుడు "హమాస్ దళాలు హోటళ్లలో కూర్చున్నాయి. పాలస్తీనా బయటే వారిని చంపేయాలి. నేను నా పని పూర్తి చేశాను. వారి అరాచకాలకు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. దేవుడు వారిని శపిస్తాడు" అని అన్నాడు. బాంబు, క్షిపణి దాడుల ధాటికి లక్షలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు . దాడుల్లో వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తమ కుటుంబాలను విడిచిపెట్టాలని గాజా పౌరులు డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు 24 వేలకుపైగా ప్రాణాలను బలితీసుకోగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులను మరింత పెంచింది. దీనికితోడు గాజాలో ఎక్కడ చూసినా మాంసపు ముద్దలే కనిపిస్తున్నాయి. శిథిలాల కింద వందల సంఖ్యలో శవాలు బయటపడుతున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉన్నారు. గాజాలో ఆసుపత్రులు, శరణార్థి శిబిరాలు క్షతగాత్రులు,వారి బంధువులతో కిటకిటలాడుతున్నాయి. అమెరికా, ఖతర్ జోక్యంతో యుద్ధాన్ని ముగించాలని చూసినా లాభం లేకుండా పోయింది. యుద్ధానికి 100 రోజులు పూర్తవడం.. ఇప్పటికైనా యుద్ధాన్ని ముగించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.

Updated Date - Jan 15 , 2024 | 11:22 AM

Advertising
Advertising