Sultan Ibrahim Iskandar: ప్రైవేట్ ఆర్మీ నుంచి జెట్స్ దాకా.. మలేషియా కొత్త కింగ్ ఆస్తుల చిట్టా.. దిమ్మతిరిగాల్సిందే!
ABN, Publish Date - Jan 31 , 2024 | 04:55 PM
ప్రపంచంలో ఉన్న అత్యంత ధనవంతుల గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. తమ రంగంలో తిరుగులేని స్థాయికి చేరుకోవడంతో, వాళ్లు ప్రపంచ కుబేరులుగా అవతరించారని రకరకాల కథనాలను చదివాం. కానీ.. ఆ కుబేరులందరినీ తలదన్నే విధంగా, ఒక రాజు వద్ద తరగని సంపద ఉన్న విషయం మీకు తెలుసా?
ప్రపంచంలో ఉన్న అత్యంత ధనవంతుల గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. తమ రంగంలో తిరుగులేని స్థాయికి చేరుకోవడంతో, వాళ్లు ప్రపంచ కుబేరులుగా అవతరించారని రకరకాల కథనాలను చదివాం. కానీ.. ఆ కుబేరులందరినీ తలదన్నే విధంగా, ఒక రాజు వద్ద తరగని సంపద ఉన్న విషయం మీకు తెలుసా? ఆయన పేరు జోహర్ సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్. మలేషియాలో సింహాసనాన్ని అధిరోహించిన ఈ 65 ఏళ్ల కింగ్ వద్ద ఎంత సంపద ఉందో తెలిస్తే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.
ఇబ్రహీం ఇస్కందర్ ఆస్తులు
నివేదిక ప్రకారం.. ఇస్కందర్ అక్షరాల 5.7 బిలియన్ల డాలర్ల (భారతీయ కరెన్సీలో రూ.47 వేల కోట్లకు పైనే) సంపదను కలిగి ఉన్నాడు. మలేషయా సరిహద్దులకు మించి విస్తరించి ఉన్న సామ్రాజ్యం అతని సొంతం. రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి మైనింగ్, టెలికమ్యూనికేషన్స్, పామాయిల్ వరకు ఆయన సామ్రాజ్యం విస్తరించింది. ఆ ఇండస్ట్రీలను ఈ రాజుగారే శాసిస్తున్నారు. మరీ ముఖ్యంగా.. రియల్ ఎస్టేట్‌లో తిరుగులేని కింగ్‌గా అవతరించాడు. మలేషియాలో అతిపెద్ద సెల్ సర్వీస్ ప్రొవైడర్ అయిన U Mobile కంపెనీలో ఇస్కందర్‌కు ఏకంగా 24 శాతం షేర్ ఉంది. అలాగే.. ఇతర పబ్లిక్, ప్రైవేట్ కంపెనీలలో $588 మిలియన్ల అదనపు పెట్టుబడులు కూడా ఉన్నాయి.
అంతేకాదండోయ్.. ఇస్కందర్ వద్ద 300కు పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. అందులో ఒకటి అడాల్ఫ్ హిట్లర్ బహుమతిగా అందించిన కారు కూడా ఉంది. బోయింగ్ 737తో సహా కొన్ని ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి. సింగపూర్‌లో $4 బిలియన్ల విలువైన భూమిని కలిగి ఉన్నాడు. ఇందులో బోటానిక్ గార్డెన్స్‌కు ఆనుకుని ఉన్న విశాలమైన ప్రాంతంలో టైర్సల్ పార్క్ ఉంది. తనకు షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్స్ నుంచి ఎనలేని లాభాలు వస్తుండటంతో.. సుల్తాన్ ఏకంగా $1.1 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టారని తెలిసింది. ఆయన కుటుంబం ఒక ప్రైవేట్ సైన్యాన్నే కలిగి ఉందంటే.. ఆయన లైఫ్ స్టైల్ ఎంత లగ్జరీగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
కొత్త రాజుగా పట్టాభిషేకం
ఇంత భారీ సంపద కలిగిన ఇబ్రహీం ఇస్కందర్.. బుధవారం మలేషియా కొత్త రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇందుకు సంబంధించిన వేడుకల్ని కౌలాలంపూర్‌లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇటు సింగపూర్ నాయకత్వంతో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు, అటు చైనీస్ డెవలపర్స్‌తో ఉన్న వ్యాపార లావాదేవీలు.. దేశీయ, విదేశాంగ విధానంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని మలేషియా ప్రజలు నమ్ముతున్నారు. ముఖ్యంగా.. మలేషియా ఆర్థిక వ్యవస్థలో ఈ కొత్త రాజు భారీ మార్పులు తీసుకొస్తారని భావిస్తున్నారు.
Updated Date - Jan 31 , 2024 | 05:01 PM