Gujarat : పడవ బోల్తా ఘటనలో 16కు చేరిన మృతుల సంఖ్య.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఆర్థిక సాయం ప్రకటన
ABN, Publish Date - Jan 18 , 2024 | 07:34 PM
గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. టీచర్లు, విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ పడవ ప్రమాదవశాత్తు మునిగిపోయింది. గురువారం జరిగిన ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడోదరకు(Vadodara) చెందిన ఓ ప్రైవేటు స్కూలు టీచర్ల బృందం విద్యార్థులతో కలిసి హరణి సరస్సు వద్దకు వచ్చారు.
గుజరాత్: గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. టీచర్లు, విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ పడవ ప్రమాదవశాత్తు మునిగిపోయింది. గురువారం జరిగిన ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడోదరకు(Vadodara) చెందిన ఓ ప్రైవేటు స్కూలు టీచర్ల బృందం విద్యార్థులతో కలిసి హరణి సరస్సు వద్దకు వచ్చారు. బోటు ఎక్కి సరస్సుల్లో విహరిస్తుండగా అది అకస్మాత్తుగా మునిగిపోయింది(Boat Capsized). ఈ ఘటనలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. మృతుల్లో 14 మంది విద్యార్థులు ఇద్దరు టీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్ల సాయంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బోటులో 27 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
పరిహారం ప్రకటించిన కేంద్రం..
వడోదరలో జరిగిన పడవ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి రూ.50 వేలు తక్షణ సాయంగా మంజూరు చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ప్రధాని అధికారులను ఆదేశించారు.
Updated Date - Jan 18 , 2024 | 08:47 PM