ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India-Maldives Row: మాల్దీవుల ట్రిప్ క్యాన్సిల్ చేస్తే బంపరాఫర్.. ఏంటో తెలిస్తే నోరూరాల్సిందే!

ABN, Publish Date - Jan 17 , 2024 | 04:29 PM

భారత్, మాల్దీవుల మధ్య వివాదం కొనసాగుతున్న తరుణంలో.. భారతీయులు మాల్దీవులకు వెళ్లాలన్న ఆలోచనని విరమించుకుంటున్నారు. ఆ ప్రాంతానికి బదులు లక్షద్వీప్‌లో విహరించాలని నిర్ణయించుకుంటున్నారు. మన ప్రధాని నరేంద్ర మోదీ, భారతదేశంపై మాల్దీవుల మంత్రులు అవమానకర వ్యాఖ్యలు చేసినందుకే.. ప్రతి ఒక్కరూ మాల్దీవులను బాయ్‌కాట్ చేస్తున్నారు.

భారత్, మాల్దీవుల మధ్య వివాదం కొనసాగుతున్న తరుణంలో.. భారతీయులు మాల్దీవులకు వెళ్లాలన్న ఆలోచనని విరమించుకుంటున్నారు. ఆ ప్రాంతానికి బదులు లక్షద్వీప్‌లో విహరించాలని నిర్ణయించుకుంటున్నారు. మన ప్రధాని నరేంద్ర మోదీ, భారతదేశంపై మాల్దీవుల మంత్రులు అవమానకర వ్యాఖ్యలు చేసినందుకే.. ప్రతి ఒక్కరూ మాల్దీవులను బాయ్‌కాట్ చేస్తున్నారు. ఈ ట్రెండ్‌కి మద్దతు ఇస్తూ.. ఒక రెస్టారెంట్ చైన్ ఓ బంపరాఫర్ ప్రకటించింది. మాల్దీవుల పర్యటనని రద్దు చేసుకున్న వారికి, అలాగే లక్షద్వీప్‌కు వెళ్లాలనుకునే వారికి.. ఉచితంగా ఛోలే భటురేని అందిస్తోంది. ఆ రెండింటిలో మీరు ఏ ఒక్క పని చేసినా.. ఎలాంటి ప్రశ్నలు సంధించకుండానే ఒక ప్లేటు ఛోలే భటురే ఉచితంగా ఇస్తామని ఆ రెస్టారెంట్ చైన్ తెలిపింది.


ఆ రెస్టారెంట్ చైన్ యజమాని విజయ్ మిశ్రా ఈ ప్రత్యేక ఆఫర్‌పై మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు అవమానకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు, తమకు ఈ ఆలోచన వచ్చిందని తెలిపారు. ఈ ప్రకటన ద్వారా తాము లక్షద్వీప్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించాలని అనుకుంటున్నామని అన్నారు. శనివారం నుంచి తాము ఈ స్కీమ్‌ని ప్రారంభించామని, దీనికి అనూహ్యమైన స్పందన వస్తోందని చెప్పారు. ఎన్‌సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజన్) ప్రాంతంలోనే 10 మంది ఈ ఆఫర్‌ని పొందారని, దీనిని వాళ్లు అభినందించారని చెప్పారు. తాము ఈ స్కీమ్‌ని జనవరి చివరి వరకూ పొడిగించాలని అనుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఇదేమీ మార్కెటింగ్ స్ట్రాటజీ కాదని.. భారతదేశానికి, లక్షద్వీప్ పర్యాటక రంగానికి మద్దతు ఇవ్వడం కోసమే ఈ ఆఫర్ అందజేస్తున్నామని ఆయన వివరణ ఇచ్చారు. కాగా.. ఈ రెస్టారెంట్ చైన్ నోయిడా, ఘాజియాబాద్‌లలో ఉంది.

ఇదిలావుండగా.. ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన ప్రధాని మోదీ, అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. సాహస యాత్రలు ఇష్టపడేవారు లక్షద్వీప్‌ని సందర్శించాలని కోరారు. ఇదిచూసిన మాల్దీవుల మంత్రులు.. ప్రధాని మోదీని అవమానిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై కూడా విమర్శలు గుప్పించారు. అప్పటి నుంచి భారత్, మాల్దీవుల మధ్య వివాదం మొదలైంది. సినీ తారల దగ్గర నుంచి రాజకీయ, వ్యాపార, ఇతర ప్రముఖులు సైతం ప్రధాని మోదీకి మద్దతుగా దిగొచ్చి.. లక్షద్వీప్ పర్యాటక రంగాన్ని ప్రోత్సాహించడంలో భాగమయ్యారు. కొన్ని సంస్థలు కూడా.. బాయ్‌కాట్ మాల్దీవుల ట్రెండ్‌కి మద్దతిస్తూ.. లక్షద్వీప్ టూరిజంని ఎంకరేజ్ చేస్తున్నాయి.

Updated Date - Jan 17 , 2024 | 04:29 PM

Advertising
Advertising