ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Adani: ఆ రాష్ట్రంలో అదానీ సంస్థల భారీ పెట్టుబడులు.. 2025నాటికి రూ.55 వేల కోట్లు లక్ష్యం

ABN, Publish Date - Jan 10 , 2024 | 02:47 PM

ప్రధాని మోదీ(PM Modi) స్వరాష్ట్రం గుజరాత్ కు పెట్టుబడులు వరద కొనసాగుతోంది. టాప్ బిలీయనీర్ అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ(Gowtham Adani) తన భారీ పెట్టుబడి ప్రణాళికను బుధవారం వివరించారు. ఆయన కంపెనీలు గుజరాత్‌లో 2025వరకు రూ.55 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

గాంధీనగర్: ప్రధాని మోదీ(PM Modi) స్వరాష్ట్రం గుజరాత్ కు పెట్టుబడులు వరద కొనసాగుతోంది. టాప్ బిలీయనీర్ అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ(Gowtham Adani) తన భారీ పెట్టుబడి ప్రణాళికను బుధవారం వివరించారు. ఆయన కంపెనీలు గుజరాత్‌లో 2025వరకు రూ.55 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

వచ్చే ఐదేళ్లలో ఈ పెట్టుబడుల మొత్తాన్ని రూ.2 లక్షల కోట్లకు పెంచబోతున్నట్లు వెల్లడించారు. గాంధీనగర్(Gandhinagar) లో జరుగుతున్న వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

"మోదీజీ మీరు కేవలం భారతదేశ ఉజ్వల భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తారు. మీ నాయకత్వంలో భారత్ 2047 నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది. భారత్ ని గొప్ప ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ప్రపంచ పటంలో ఉంచారు. 2014 నుంచి దేశ జీడీపీ 185%, తలసరి ఆదాయం 165% పెరిగింది. దశాబ్దంలో కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను తట్టుకుని ఈ తరహా విజయం సాధించడం గొప్ప విషయం" అని అదానీ అన్నారు.

725 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కచ్‌ ఖవ్దాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎనర్జీ పార్క్‌ను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఇది అంతరిక్షం నుంచి కనిపిస్తుందని తెలిపారు. గుజరాత్ లో భారీ పెట్టుబడులతో లక్షకుపైగా శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.

Updated Date - Jan 10 , 2024 | 02:48 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising