Delhi: గర్భాశయ క్యాన్సర్‌కు వ్యాక్సిన్లు.. 7 కోట్ల డోసులు సిద్ధం.
ABN, Publish Date - Jan 12 , 2024 | 06:04 PM
మహిళలను ఇప్పుడు ప్రధానంగా వేధిస్తున్న సమస్య గర్భాశయ క్యాన్సర్. వయస్సుతో సంబంధంలేకుండా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రస్తుతం దేశంలోని చాలా మంది మహిళల్లో క్యాన్సర్ రావడానికి రెండో ప్రధాన కారణం ఇదే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గర్భాశయ క్యాన్సర్‌ను ప్రపంచపు 4వ అత్యంత సాధారణ రకం క్యాన్సర్‌గా పేర్కొంది. అయితే దీన్ని ప్రారంభ దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపడితే ఫలితం ఉంటుందంటున్నారు డాక్టర్లు.
ఢిల్లీ: మహిళలను ఇప్పుడు ప్రధానంగా వేధిస్తున్న సమస్య గర్భాశయ క్యాన్సర్. వయస్సుతో సంబంధంలేకుండా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రస్తుతం దేశంలోని చాలా మంది మహిళల్లో క్యాన్సర్ రావడానికి రెండో ప్రధాన కారణం ఇదే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గర్భాశయ క్యాన్సర్‌ను ప్రపంచపు 4వ అత్యంత సాధారణ రకం క్యాన్సర్‌గా పేర్కొంది. అయితే దీన్ని ప్రారంభ దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపడితే ఫలితం ఉంటుందంటున్నారు డాక్టర్లు.
దేశంలో 9 -14 ఏళ్ల వయస్సుల్లోని బాలికలే లక్ష్యంగా హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) టీకా ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ ఇమ్యూనైజేషన్ డ్రైవ్ 3 దశల్లో ప్రారంభమవుతుంది. ప్రారంభ దశ కోసం 7 కోట్ల డోస్ లు సిద్ధం చేశారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న HPV టీకా ధర రూ.2 వేలుగా ఉంది. దీనిని గర్భాశయ క్యాన్సర్‌కు మాత్రమే కాకుండా ఇతర వ్యాధులను ఎదుర్కోవడానికి రూపొందించారు. హెచ్‌పీవీతో సంబంధం ఉన్న వివిధ రోగాలనుంచి ఈ టీకా రక్షణ కల్పిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఏటా నమోదయ్యే క్యాన్సర్ కేసుల్లో భారత్ 5వ స్థానంలో ఉంది. క్యాన్సర్ కేసుల సంఖ్య 2022లో 14.6 లక్షల నుంచి 2025నాటికి 15.7 లక్షలకు పెరుగుతాయని అంచనా. గర్భాశయ క్యాన్సర్ ని అంతమొందించే లక్ష్యంతో కేంద్రం ఈ టీకాను ఉచితంగా అందించాలని భావిస్తోంది. చిన్నవయస్సులోనే క్యాన్సర్ ని అరికట్టగలిగితే మహిళల రోగనిరోధక శక్తి మరింతగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
Updated Date - Jan 12 , 2024 | 06:04 PM