Delhi: ప్రజాస్వామ్యాన్ని హేళన చేసేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి... ప్రధాని మోదీ స్పష్టీకరణ
ABN, Publish Date - Jan 31 , 2024 | 11:41 AM
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు గతంలో ప్రజాస్వామ్యాన్ని హేళన చేసే విధంగా పలువురు ఎంపీలు ప్రవర్తించారని.. వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
ఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు గతంలో ప్రజాస్వామ్యాన్ని హేళన చేసే విధంగా పలువురు ఎంపీలు ప్రవర్తించారని.. వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. సమావేశాలు ఫలప్రదంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలను కించపరిచే వారు, చివరి సెషన్‌లోనైనా ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
ప్రస్తుత 17వ లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు కానుండగా నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాక తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాదిలోనే లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. బుధవారం ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Jan 31 , 2024 | 11:42 AM