ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Big Ticket winner: రాత్రి డ్రైవర్.. తెల్లారేసరికి కోటీశ్వరుడు.. ఈ గ్యాప్‌లో ఏం జరిగిందంటే..

ABN, Publish Date - Jan 04 , 2024 | 06:01 PM

అదృష్టం తలుపు తట్టినప్పుడే.. ఆ తలుపు తీసి ఆహ్వానించాలంటారు.. లేదంటే బతుకెప్పుడూ కలలు, ఆశల్లోనే కొనసాగుతూ ఉంటుంది. అయితే, ఉపాధి కోసం ఇండియా నుంచి యూఏఈ వలస వెళ్లిన ఓ డ్రైవర్.. అలా వచ్చిన అదృష్టాన్ని ఇలా అందిపుచ్చుకున్నాడు. ఇంకేముంది.. రాత్రి వరకు డ్రైవర్‌గా ఉన్న అతను.. తెల్లారేసరికి కోటీశ్వరుడు అయ్యాడు.

Big Ticket Lotter winner

అబూదాబీ: అదృష్టం తలుపు తట్టినప్పుడే.. ఆ తలుపు తీసి ఆహ్వానించాలంటారు.. లేదంటే బతుకెప్పుడూ కలలు, ఆశల్లోనే కొనసాగుతూ ఉంటుంది. అయితే, ఉపాధి కోసం ఇండియా నుంచి యూఏఈ వలస వెళ్లిన ఓ డ్రైవర్.. అలా వచ్చిన అదృష్టాన్ని ఇలా అందిపుచ్చుకున్నాడు. ఇంకేముంది.. రాత్రి వరకు డ్రైవర్‌గా ఉన్న అతను.. తెల్లారేసరికి కోటీశ్వరుడు అయ్యాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 44 కోట్లను సొంతం చేసుకున్నాడు. ఇంతకీ అసలేం జరిగిందో ఓసారి తెలుసుకుందాం..

యూఏఈలోని అల్ ఐన్‌లో పని చేస్తున్న భారతదేశానికి చెందిన ఒక ప్రైవేట్ డ్రైవర్‌కు లాటరీ రూపంలో జాక్‌పాట్ తగిలింది. డిసెంబర్ 31న జరిగిన బిగ్ టికెట్ లైవ్ డ్రాలో 20 మిలియన్ యూఏఈ దిర్హామ్‌లు గెలుచుకున్నాడు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 44 కోట్లు. ఈ జాక్‌పాట్‌తో కొత్త సంవత్సరానికి అద్భుతంగా స్వాగతం పలికాడు ఆ వ్యక్తి.

గల్ఫ్ న్యూస్ ప్రకారం.. మునావర్ ఫైరూస్ గత ఐదేళ్లుగా ప్రతి నెలా లాటరీ టికెట్లు కొంటున్నాడు. ఈ క్రమంలోనే సిరీస్ 259 బిగ్ టికెట్ కొనుగోలు చేశాడు. డిసెంబర్ 31న నిర్వహించిన బిగ్ టికెట్ లైవ్ డ్రాలో మునావర్ ఫైరూస్ విజేతగా నిలిచాడు. అయితే, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ మొత్తానికి విజేత ఇతనొక్కడే కాదు. ఈ లాటరీ టికెట్‌ను 30 మంది కలిసి కొనుగోలు చేశారట. దీంతో వచ్చిన ప్రైజ్ మనీని ఆ 30 మందితో మునావర్ షేర్ చేసుకోనున్నాడు.

అయితే, లాటరీ తగలడంపై స్పందించిన మునావర్.. తానింకా నమ్మలేకపోతున్నానని అన్నాడు. తనకు లాటరీ తగులుతుందని అస్సలు ఊహించలేదన్నారు. ఈ గుడ్ న్యూస్ విని తేరుకోవడానికి కొంత సమయం పడుతుందని అన్నాడు మునావర్.

ఇక ఫైరూస్ మాత్రమే కాకుండా మరికొందరు ఇండియన్స్, పాలస్తీనియన్‌, లెబనీస్, సౌదీ అరేబియా దేశాలకు చెందిన 10 మంది వ్యక్తులు 100,000 యూఏఈ దిర్హామ్‌ల విలువైన నగదు బహుమతులు గెలుచుకున్నట్లు లాటరీ నిర్వాహకులు ప్రకటించారు.

అదే రోజు విజేతగా మరో భారతీయుడు..

అదే రోజు మరో భారతీయుడు కుమారేశన్ డిసెంబర్‌లో నాల్గవ వారపు ఇ-డ్రా విజేతగా ఎంపికయ్యాడు. 1 మిలియన్ UAE దిర్హామ్‌లు గెలుచుకున్నాడు. భారత కరెన్సీలో ఇది రూ. 22,668,500 ఉంటుంది. కాగా, కుమారేసన్ ఎతిహాద్ ఎయిర్‌వేస్‌లో ఇంజనీర్‌గా పని చేస్తూ అబుదాబిలో నివసిస్తున్నాడు. అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని ఇన్-స్టోర్ కౌంటర్‌ల వద్ద తాను ప్రయాణించే ప్రతిసారీ టిక్కెట్‌లను కొనుగోలు చేసేవాడినని సుకి ఎప్పుడూ ఆగుతానని కుమారేశన్ చెప్పుకొచ్చాడు. ఈ టికెట్‌ నంబర్లను తన ఏడేళ్ల కుమార్తె సెలక్ట్ చేసిందని, లాటరీ గెలుపొందడంపై తన కుటుంబం చాలా సంతోషంగా ఉందన్నారు. వచ్చిన డబ్బుతో ఇండియాలో తానొక ఇంటిని కొనుగోలు చేస్తామన్నారు.

Updated Date - Jan 04 , 2024 | 06:01 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising